మెర్సిడెస్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్..
న్యూఢిల్లీ: టయోటా, రెనో, టాటా మోటార్స్, నిస్సాన్ దారిలోనే మెర్సిడెస్ బెంజ్ కూడా పయనిస్తోంది. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల దిగ్గజం... తన కార్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరలపెంపు నిర్ణయం 2017, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఉత్పత్తి వ్యయం ఎగయడం, ఫారెక్స్ ధరల్లో మార్పు వంటి అంశాలను ధరల పెంపునకు కారణాలుగా పేర్కొంది. కాగామెర్సిడెస్ బెంజ్ రూ.27 లక్షలు నుంచి రూ.2.6 కోట్ల ధర శ్రేణిలో తన కార్లను భారత్‌లో విక్రయిస్తోంది.