బెంజ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్.. | Arun Jaitley's Budget 2016 makes Mercedes-Benz hike prices up to 5% | Sakshi
Sakshi News home page

బెంజ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్..

Published Thu, Mar 3 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

బెంజ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్..

బెంజ్ కార్ల ధరలూ పెరుగుతున్నాయ్..

రూ. 5 లక్షల వరకూ పెంపు...
 న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కారు ధరలు పెరగనున్నాయి. మార్చి 15 నుంచి వాహన ధరలను రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సు, అదనపు లగ్జరీ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించడ మే కారణమని తెలిపింది. మోడల్‌ను బట్టి ధర పెరుగుదల 3-5%(రూ.లక్ష-5 లక్షలు) మధ్యలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఏ-క్లాస్ నుంచి మేబ్యాక్ వరకు పలు రకాల మోడ ళ్లను భారత మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ.28 లక్షలు-రూ.1.67 కోట్లు. ప్రభుత్వపు కొత్త పన్నులు, బలహీనమైన రూపాయి, ఉత్పత్తి వ్యయం పెరుగుదల వంటి తదితర అంశాల కారణంగా కంపెనీపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, అందుకే ధరల్ని పెంచక తప్పడం లేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా చీఫ్ రోనాల్డ్ ఫాల్గెర్ తెలిపారు. కాగా, టాటా మోటార్స్ ఇప్పటికే ప్యాసెంజర్ వాహన ధరలను పెంచింది. హ్యుందాయ్, హోండా కూడా కారు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement