మెర్సిడెస్ కొత్త ఎస్‌యూవీ.. జీఎల్‌ఈ | jlei new SUV Mercedes .. | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ కొత్త ఎస్‌యూవీ.. జీఎల్‌ఈ

Published Thu, Oct 15 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

మెర్సిడెస్ కొత్త ఎస్‌యూవీ.. జీఎల్‌ఈ

మెర్సిడెస్ కొత్త ఎస్‌యూవీ.. జీఎల్‌ఈ

ధరలు రూ. 58.9 లక్షల నుంచి రూ. 69.90 లక్షల రేంజ్‌లో
 
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త ఎస్‌యూవీని బుధవారం  ఆవిష్కరించింది. భారత్‌లోనే తయారు చేసే ఈ   జీఎల్‌ఈ ఎస్‌యూవీ ధరలు రూ.58.9 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోల్గర్ చెప్పారు. రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని పేర్కొన్నారు. 250డి (2,143 సీసీ డీజిల్ ఇంజిన్) ఎస్‌యూవీ ధర రూ.58.90 లక్షలని, 350 డి(2,987 సీసీ డీజిల్ ఇంజిన్) ఎస్‌యూవీ ధర రూ.69.90 లక్షలని(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు.

ఎంఎల్-క్లాస్ ఎస్‌యూవీలో మార్పులు, చేర్పులు చేసి ఈ మోడల్‌ను మెర్సిడెస్ బెంజ్ అందిస్తోంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ కాలానికి తమ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో 70 శాతం చొప్పున వృద్ధి సాధించిందని రోలాండ్ పేర్కొన్నారు. ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందిస్తామని చెప్పామని, ఇప్పటివరకూ 13 కొత్త మోడళ్లను తీసుకొచ్చినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement