Showroom
-
ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..
మార్కెట్లో ఎలాంటి కార్లు ఉన్నాయి.. బడ్జెట్ వివరాలతోపాటు మనకు కావాల్సిన ఫీచర్లు ఏ మోడళ్లలో ఉన్నాయి. ఒక ధరల శ్రేణిలో లభిస్తున్న మోడళ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి.. ఇలాంటి అంశాలన్నీ ఆన్లైన్లో తెలుసుకుంటున్నప్పటికీ అత్యధికులు షోరూంకు వెళ్లే కారు స్టీరింగ్ పడుతున్నారట. ప్రత్యక్షంగా ఔట్‌లెట్‌కు వెళ్లి పరిశీలించిన తర్వాతే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారని అర్బన్ సైన్స్ సర్వేలో తేలింది. భారత్‌తోపాటు యూఎస్, జర్మనీ, యూకే, చైనా, మెక్సికో నుంచి 9,000 పైచిలుకు మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. భారత్‌లో 10 మంది కార్ల కొనుగోలుదార్లలో దాదాపు 9 మంది షోరూంను సందర్శించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.నమ్మదగిన విధానం..ఇలా ఔట్‌లెట్‌కు వెళ్లడాన్ని ఒక ప్రధాన ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి నమ్మదగిన విధానంగా కస్టమర్లు భావిస్తున్నారు. కారును కొనుగోలు చేయడంలో కుటుంబ పాత్ర ఉంటుంది. షోరూంలతో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. నేరుగా వెళ్లడం వల్ల కార్లను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇటువంటి అనుభవాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఇవ్వలేవు. డీలర్‌షిప్‌లు నమ్మకాన్ని పెంపొందిస్తాయి, వ్యక్తిగతీకరించిన డీల్స్ ఉంటాయి. సంబంధాలు పెంపొందించబడతాయి. అమ్మకాల తర్వాత మద్దతు కూడా ఉంటుందన్నది కస్టమర్ల భావన. ఇందుకు అనుగుణంగా కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తయారీ సంస్థలు నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నాయి. ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్ఆన్లైన్లో బ్రౌజింగ్..సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రస్తుతం భారతదేశ ఆటోమోటివ్ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. డిజిటల్ వేవ్ క్రమంగా ఊపందుకుంటోంది. యువకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు షోరూమ్‌లోకి అడుగుపెట్టే ముందు ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నారు. డీలర్‌షిప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు రెండూ భవిష్యత్తులో కొనసాగుతాయి. సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రత్యేకంగా అందించే నమ్మకాన్ని, వ్యక్తిగత సంబంధాలను కాపాడుకుంటూ.. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి సరైన సమతూకం సాధించడం చాలా అవసరం’ అని సర్వేలో వెల్లడైంది. -
ఓలా షోరూంకు తాళం వేసిన కస్టమర్.. ఏం జరిగిందంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఓలా కస్టమర్ ప్రస్టేషన్ పీక్కు చేరింది. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కి తాళం వేశాడు. బైక్‌లో పదేపదే సమస్యలు వచ్చినా సిబ్బంది స్పందించడం లేదని కస్టమర్ సీరియస్ అయ్యారు. నడిరోడ్డుపై తరచూ బైక్ ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ చేయకపోగా బెదిరిస్తున్నారంటూ కస్టమర్ ఆరోపించారు.కాగా, ఇటీవల కర్ణాటకలోని కాలబురగి జిల్లాలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్ తన బైక్‌ను రిపేర్ చేయడం లేదని షోరూం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఓలా షోరూంకు నిప్పు పెట్టి తగులబెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మరో ప్రాంతంలో ఓలా బైక్‌కి చెప్పుల దండ వేసి ఊరేగించగా.. మరో ఘటనలో కస్టమర్.. స్కూటీని తగులబెట్టాడు. రిపేర్ వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి షోరూం ముందే బైక్‌ను సుత్తితో పగలగొట్టాడు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు టెస్లా.. ఢిల్లీలో షోరూం కోసం అన్వేషణ!
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.భారత్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్‌లో మస్క్ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్‌లోని సైబర్ హబ్‌తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం కంపెనీ ఇతర డెవలపర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.భారత్‌లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్‌ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్‌కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్‌ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్‌కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్‌ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
ఈవీ బైక్ షోరూం యజమాని అరెస్టు
బనశంకరి: బెంగళూరులోని రాజ్‌కుమార్ రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్, మేనేజర్ యువరాజ్‌ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఇష్టపడి కొంటే.. బూడిదైందికృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్ని కొన్నారు. పికప్ లేదని, సర్వీసింగ్ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్ చేసి బైక్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్‌ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. -
అనంతపురంలో జ్యువెలరీ షాప్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున (ఫొటోలు)
-
వరదలో టాటా షోరూం
-
శారీ షో రూమ్ లో తళుక్కుమన్న ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ (ఫొటోలు)
-
వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్..
సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్‌ను బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్ జోహార్’ ఆభరణాల స్టోర్ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్ ప్రదర్శించారు. -
లేపాక్షిలో థీమాటిక్ ఎగ్జిబిషన్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–69లోని నందగిరిహిల్స్‌లోని లేపాక్షి హస్తకళా షోరూంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లెదర్ పప్పెట్స్, పెన్ కలంకారీ చీరలు, ఏలూరు కార్పెట్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఈ చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన కళాకారులు తమ చేతులకు పనిచెబుతూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. -
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్‌లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
నంద్లాల్ షోరూమ్‌లో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)
-
HYD: అగ్ని ప్రమాదం.. అన్లిమిటెడ్ షోరూంలో ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, హైదరాబాద్: హబ్సిగూడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్లిమిటెడ్ షోరూంలో మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. రెండు ఫోర్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంక్‌ను పైర్ సిబ్బంది మూయించివేశారు. -
ముచ్చటపడి కొనుక్కున్న బైక్.. మొదటి నుంచీ సమస్యలే.. చిర్రెత్తుకొచ్చి
హిందూపురం: సేవా లోపం కారణంగా అసహనానికి గురైన ఓ యువకుడు షోరూం ఎదుట తన నూతన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. హిందూపురంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న టీవీఎస్ షోరూంలో బీరేపల్లికి చెందిన మనోజ్ ఫైనాన్స్ కింద ఓ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. పట్టుమని ఐదు నెలలు కూడా గడవక ముందే వాహనంలో సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. సమస్య తలెత్తిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిబెడుతూ వచ్చారు. అయినా సాంకేతిక సమస్యలు తప్పలేదు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి వాహనం మరమ్మతుకు గురవడంతో షోరూంకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో షోరూం నిర్వాహకులతో వాగ్వాదం జరిగి అసహనానికి గురైన మనోజ్ వెంటనే షోరూం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఘటనతో నివ్వెర పోయిన షోరూం నిర్వహకులు వెంటనే మంటల్ని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. -
Samyuktha Menon: నగల షోరూం ప్రారంభోత్సవంలో నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
500వ షోరూమ్ ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ - ఎక్కడంటే?
దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉత్తమ అమ్మకాలు పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎట్టకేలకు తన 500వ షోరూమ్ ప్రారంభించింది. ప్రారంభంలో ఒక్క షోరూమ్ కూడా లేకుండా మొదలైన ఓలా ఇప్పుడు భారీ స్థాయిలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ & షోరూమ్‌లను ప్రారంభించడంలో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ షోరూమ్ ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన 500వ షోరూమ్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో ఓలా షోరూమ్ ఉన్నట్లు సమాచారం. అయితే 2023 ఆగష్టు నాటికి దేశంలో ఈ షోరూమ్‌ల సంఖ్య 1000కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను, షోరూమ్‌లను పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం ఎక్కువ భాగం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌ల ద్వారా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. అయితే కంపెనీకి చెందిన షోరూమ్‌లు వాహనాలను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా టెస్ట్ రైడ్ వంటి సదుపాయాలను అందించడానికి ఉపయోగపడుతున్నాయి. (ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) ఓలా 500వ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సిఎమ్ఓ 'అన్షుల్ ఖండేల్వాల్' మాట్లాడుతూ.. ప్రస్తుతం 500వ షోరూమ్ ప్రారంభమైంది, అయితే రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. భారత్‌కు సుస్థిర భవిష్యత్తు అందించడానికి తమ కృషి ఇలాగే కొనసాగుతూ ఉంటుందని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 40 శాతం వరకు ఉంది. కంపెనీ గత నెలలో ఏకంగా 30,000 యూనిట్లకుపైగా విక్రయించి, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో నిలబడింది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరింత గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. -
కూకట్‌పల్లిలో రీతూ వర్మ సందడి (ఫొటోలు)
-
విజయవాడలో అనుపమ, మంత్రి రోజా సందడి (ఫొటోలు )
-
రాజమండ్రిలో అల్లు శిరీష్, అనసూయ, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
షోరూమ్ ను ప్రారంభించిన అనకాపల్లి ఎంపీ సత్యవతి
-
దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం
న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్ల తెలిపారు. షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు) -
కుషాయిగూడ బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో చోరీ
-
మహిళా సిబ్బందితో టాటా మోటార్స్ షోరూం!
హైదరాబాద్: టాటా మోటార్స్ తన డీలర్ భాగస్వామి వెంకటరమణ మోటార్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహిళా సిబ్బందితో ప్యాసింజర్ వెహికల్స్ షోరూంని ఇటీవల ప్రారంభించింది. మొత్తం 20 మంది మహిళా బృందంతో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ‘‘మహిళా షోరూం’’ అని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న మహిళా కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా షోరూంను ప్రారంభించాము. నాయకత్వాన్ని కోరుకునే మహిళలకు ఈ కేంద్రం అంకితమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు. -
సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి మృతి
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. దట్టమైన పొగ.. వివిధ పనుల మీద నగరానికి వచ్చి లాడ్జీలో బస చేసినవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతావారు ఎలాగో తప్పించుకునా ఏడుగురు కాలినగాయాలు, పొగతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 13 మంది గాయపడినట్లు సమాచారం కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటన సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సేద తీరుతుండగా..: ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ ఎదురుగా రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ పేరుతో బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తున్నా రు. ఈ షోరూమ్ సెల్లార్లో ఉండగా, ఆపై నాలుగు అంతస్తుల్లో రూబీ డీలక్స్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సెల్లార్‌లోని షోరూమ్ నుంచి మంటలు చెలరేగాయి. ఇందులో ఎలక్ట్రికల్ బైక్‌ల బ్యాటరీలు పేలి భారీ శబ్దాలతో పాటు మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్తుల్లోని లాడ్జీ గదుల్లోకి మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన కొంతమంది హోటల్ గదుల నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు మాత్రం దట్టమైన పొగల కారణంగా బయటకు రాలేక గదుల్లో చిక్కుకుపోయారు. లాడ్జీలో 23 మంది..: హోటల్లో వ్యాపారాల నిమిత్తం ఉత్తర భారత దేశం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 23 మంది ఉన్నట్లు తేలింది. దట్టమైన పొగలు పైన ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో చాలామంది పై నుంచి కిందకు దిగేందుకు వీలులేకుండా పోయింది. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీ పైప్‌ల ద్వారా నాలుగు, మూడో అంతస్తుల నుంచి కిందకు దిగారు. వీళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే దీన్ని ఆనుకుని ఉండే యాత్రి ఇన్ హోటల్ మీదుగా మరికొంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి సైతం ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది స్నారికల్ వాహనం ద్వారా కొంత మందిని కిటికీల నుంచి బయటకు రప్పించి రక్షించారు. ఒక మహిళతో పాటు మరో ముగ్గురు గదుల్లో అపస్మారక స్థితిలో పడిఉండగా బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాలిన గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా మిగతా వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ పోలీసులు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది, పెద్దసంఖ్యలో స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులు కిటికీల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి నిచ్చెనలు అందించి, పైప్‌ల ద్వారా దిగేలా సహాయం చేశారు. మరికొంత మంది పొగలోనే లోపలికి వెళ్లి గదుల్లో ఉండే వారిని బయటకు తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాద ఘటన తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతా క్షణాల్లోనే: కేశవులు, చెన్నై చెన్నై నుంచి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. రాత్రి 9 గంటలకు హోటల్లో దిగాను. అంతలోపే ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. స్థానికుల సహాయంతో 4వ అంతస్తు నుంచి పైౖౖపులు పట్టుకుని కిందకు దిగాను. ఇది మరో జన్మ: ఉమేష్ ఆచార్య, ఒడిశా ఒడిశా నుంచి ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. 4వ అంతస్తులో ఉన్నాను. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. మెట్ల నుంచి వెళ్లే అవకాశం కనిపించలేదు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పైపులు పట్టుకుని దిగాలని «ధైర్యం చేశా. పైపులు పట్టుకుని కిందికి దిగాను. ఇది నాకు మరో జన్మ. పొగ పీల్చుకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఇదీ చదవండి: మళ్లీ.. గోదావరి ఉగ్రరూపం