సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఓలా కస్టమర్ ప్రస్టేషన్ పీక్‌కు చేరింది. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కి తాళం వేశాడు. బైక్‌లో పదేపదే సమస్యలు వచ్చినా సిబ్బంది స్పందించడం లేదని కస్టమర్ సీరియస్ అయ్యారు. నడిరోడ్డుపై తరచూ బైక్ ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ చేయకపోగా బెదిరిస్తున్నారంటూ కస్టమర్ ఆరోపించారు.
కాగా, ఇటీవల కర్ణాటకలోని కాలబురగి జిల్లాలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్ తన బైక్‌ను రిపేర్ చేయడం లేదని షోరూం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఓలా షోరూంకు నిప్పు పెట్టి తగులబెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మరో ప్రాంతంలో ఓలా బైక్‌కి చెప్పుల దండ వేసి ఊరేగించగా.. మరో ఘటనలో కస్టమర్.. స్కూటీని తగులబెట్టాడు. రిపేర్ వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి షోరూం ముందే బైక్‌ను సుత్తితో పగలగొట్టాడు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment