గల్ఫ్‌లో ఒకే రోజు 7 మలబార్ షోరూమ్‌లు
హైదరాబాద్: ఆభరణాల విక్రయ రంగంలో ప్రముఖ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గల్ఫ్ దేశాల్లో ఒకే రోజు ఏడు కొత్త షోరూమ్‌లను ప్రారంభించింది. యూఏఈలో ఐదు, కువైట్‌లో ఒకటి, బహ్రెయిన్‌లో ఒకటి వీటిలో ఉన్నాయి. వీటిలో 18, 22, 24 క్యారట్ల బంగారు ఆభరణాలతోపాటు, వజ్రాలు, ఆన్‌కట్ వజ్రాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ షోరూమ్‌ల విస్తరణపై రూ.620 కోట్లను వెచ్చించనున్నట్టు మలబార్ గోల్డ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి లోపు అదనంగా 24 షోరూమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం షోరూమ్‌ల సంఖ్యను 185కి పెంచుకోనుంది.