మలబార్ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్ | Malabar GemStone Jewellery Festival | Sakshi
Sakshi News home page

మలబార్ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్

Published Thu, Aug 27 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

మలబార్ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్

మలబార్ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్

హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నగరాల్లో నిర్వహిస్తోంది. వినూత్నమైన, ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ఈ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని తమ షోరూమ్‌ల్లో ఈ నెల 21న ప్రారంభమైందని, వచ్చే నెల 26న ముగుస్తుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పచ్చలు, కెంపులు, రత్నాలు, ముడి వజ్రాలు తదితర విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను ఈ ఫెస్టివల్‌లో డిస్‌ప్లే చేస్తామని పేర్కొంది.

ముడి వజ్రాలతో రూపొందిన ఎరా బ్రాండ్ ఆభరణాలు, విలువైన రత్నాలతో రూపొందించిన ప్రిసియా బ్రాండ్ ఆభరణాలను ఆకర్షణీయమైన ధరల్లో కొనుగోలు చేయడానికి ఈ ఫెస్టివల్ మంచి అవకాశమని వివరించింది. ఈ ఆభరణాలకు జీవిత కాల ఉచిత మెయింటనెన్స్, ఒక ఏడాది ఉచిత బీమా కవరేజీ,  బై-బ్యాక్ గ్యారంటీ వంటి ఆఫర్లున్నాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement