Malabar Gold and Diamonds Company
-
మలబార్ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నగరాల్లో నిర్వహిస్తోంది. వినూత్నమైన, ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ఈ జెమ్‌స్టోన్ జ్యూయలరీ ఫెస్టివల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని తమ షోరూమ్‌ల్లో ఈ నెల 21న ప్రారంభమైందని, వచ్చే నెల 26న ముగుస్తుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పచ్చలు, కెంపులు, రత్నాలు, ముడి వజ్రాలు తదితర విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను ఈ ఫెస్టివల్లో డిస్ప్లే చేస్తామని పేర్కొంది. ముడి వజ్రాలతో రూపొందిన ఎరా బ్రాండ్ ఆభరణాలు, విలువైన రత్నాలతో రూపొందించిన ప్రిసియా బ్రాండ్ ఆభరణాలను ఆకర్షణీయమైన ధరల్లో కొనుగోలు చేయడానికి ఈ ఫెస్టివల్ మంచి అవకాశమని వివరించింది. ఈ ఆభరణాలకు జీవిత కాల ఉచిత మెయింటనెన్స్, ఒక ఏడాది ఉచిత బీమా కవరేజీ, బై-బ్యాక్ గ్యారంటీ వంటి ఆఫర్లున్నాయని తెలిపింది. -
మలబార్ ఫెస్టివల్ తొలి వీక్లీ డ్రా
విజేత హైదరాబాద్ వాసి తిరుపతి: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నిర్వహిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్(ఎంజీడీఎఫ్) తొలి వీక్లీ డ్రా తిరుపతిలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి, విజేతలైన వారికి విలువైన బహుమతులు ప్రదానం చేయడం శుభపరిణామం అన్నారు. ఈ డ్రాలో హైదరాబాద్‌కు చెందిన సిహెచ్. సుహాసిని 250 గ్రాముల బంగారాన్ని గెల్చుకున్నారని సంస్థ ఏపీ, టీఎస్ మార్కెటింగ్ హెడ్ కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. ఈ నెల 12న ప్రారంభమైన ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్ (ఎంజీడీఎఫ్) జనవరి 31వరకూ జరుగుతుందని వివరించారు. తమ అవుట్లెట్లలో రూ.30,000 కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ అండ్ విన్ కూపన్ ఇస్తామని, బంగారు నాణాన్ని కచ్చితంగా గెల్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వీక్లీ డ్రాలు జరుగుతాయని, విజేతలు బహుమతులుగా బంగారు కడ్డీలు గెల్చుకోవచ్చని పేర్కొన్నారు. బంపర్ డ్రాలో విజేతకు కిలో బంగారం బహుమతిగా ఇస్తామని వివరించారు. ఈ ఫెస్టివల్లో 50 కేజీల వరకూ బంగారాన్ని బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. -
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విస్తరణ
15 రోజుల్లో 5 కొత్త షోరూమ్‌లు హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ 15 రోజుల్లో ఐదు కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తోంది. 123వ షోరూమ్‌ను కడపలో ఏర్పాటు చేస్తున్నామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌ను ఈ నెల 21న(ఆదివారం) ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ ప్రారంభిస్తారని, ఈ షోరూమ్‌లో బంగారు, వజ్ర, వెండి ఆభరణాలతో పాటు ప్లాటినమ్ ఆభరణాలను కూడా విక్రయిస్తామని పేర్కొంది. తమ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్లో వినియోగదారులు 50 కేజీల వరకూ బంగారాన్ని గెల్చుకోవచ్చని తెలిపింది. వచ్చే నెల 31 వరకూ ఈ ఆఫర్ ఉంటుందని, తమ అవుట్లెట్లలో రూ.30,000 కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ అండ్ విన్ కూపన్ ఇస్తామని, బంగారు నాణాన్ని కచ్చితంగా గెల్చుకునే అవకాశం ఉంటుందని వివరించింది. వీక్లీ డ్రాలు జరుగుతాయని, విజేతలు బహుమతులుగా బంగారు కడ్డీలు గెల్చుకోవచ్చని పేర్కొంది. బంపర్ డ్రాలో విజేతకు కిలో బంగారం బహుమతిగా ఇస్తామని వివరించింది. ఇక విస్తరణలో భాగంగా తమ 122వ షోరూమ్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నామని, దీనిని తమ బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్ నేడు(శనివారం) ప్రారంభిస్తారని పేర్కొంది. ఇది దుబాయ్‌లోనే అతి పెద్ద షోరూమ్ అని తెలిపింది. ఈ నెల 24న రియాద్‌లో 124వ షోరూమ్‌ను, ఈ నెల 26న సింగపూర్‌లో 125వ షోరూమ్‌ను, వచ్చే నెల 3న 126వ షోరూమ్‌ను గుల్బర్గాలో ఏర్పాటు చేస్తామని మలబార్ గోల్డ్ అండ్ ైడైమండ్స్ పేర్కొంది. -
సీఎం సహాయ నిధికి మలబార్ గోల్డ్ రూ.13 లక్షలు
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.13 లక్షల విరాళం ఇచ్చింది. వైజాగ్ హుద్‌హుద్ తుఫాన్ బాధితుల సహాయార్థం ఈ విరాళమిచ్చామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.