
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విస్తరణ
15 రోజుల్లో 5 కొత్త షోరూమ్‌లు
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ 15 రోజుల్లో ఐదు కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తోంది. 123వ షోరూమ్‌ను కడపలో ఏర్పాటు చేస్తున్నామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌ను ఈ నెల 21న(ఆదివారం) ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ ప్రారంభిస్తారని, ఈ షోరూమ్‌లో బంగారు, వజ్ర, వెండి ఆభరణాలతో పాటు ప్లాటినమ్ ఆభరణాలను కూడా విక్రయిస్తామని పేర్కొంది.
తమ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్‌లో వినియోగదారులు 50 కేజీల వరకూ బంగారాన్ని గెల్చుకోవచ్చని తెలిపింది. వచ్చే నెల 31 వరకూ ఈ ఆఫర్ ఉంటుందని, తమ అవుట్‌లెట్లలో రూ.30,000 కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ అండ్ విన్ కూపన్ ఇస్తామని, బంగారు నాణాన్ని కచ్చితంగా గెల్చుకునే అవకాశం ఉంటుందని వివరించింది. వీక్లీ డ్రాలు జరుగుతాయని, విజేతలు బహుమతులుగా బంగారు కడ్డీలు గెల్చుకోవచ్చని పేర్కొంది.
బంపర్ డ్రాలో విజేతకు కిలో బంగారం బహుమతిగా ఇస్తామని వివరించింది. ఇక విస్తరణలో భాగంగా తమ 122వ షోరూమ్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నామని, దీనిని తమ బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్ నేడు(శనివారం) ప్రారంభిస్తారని పేర్కొంది. ఇది దుబాయ్‌లోనే అతి పెద్ద షోరూమ్ అని తెలిపింది. ఈ నెల 24న రియాద్‌లో 124వ షోరూమ్‌ను, ఈ నెల 26న సింగపూర్‌లో 125వ షోరూమ్‌ను, వచ్చే నెల 3న 126వ షోరూమ్‌ను గుల్బర్గాలో ఏర్పాటు చేస్తామని మలబార్ గోల్డ్ అండ్ ైడైమండ్స్ పేర్కొంది.