స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్‌ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్‌కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్‌ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్‌కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్‌ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7
— Gems (@gemsofbabus_) November 24, 2024
ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్‌ఈసీ సమన్లు
ఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment