అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్‌లకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్(యూఎస్ ఎస్‌ఈసీ) సమన్లు అందజేసినట్లు పీటీఐ తెలిపింది. అయితే విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసి వారిని పిలిపించే అధికారం యూఎస్ ఎస్‌ఈసీకి లేదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి అదానీ సహా మరో ఏడుగురు అధికారులు భారత ఉన్నతాధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సదరు అదానీ గ్రూప్ అధికారులపై అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడంతో యూఎస్ ఎస్‌ఈసీకి ఈమేరకు ఫిర్యాదు అందింది. దాంతో దర్యాప్తు జరిపి అధికారులకు లంచం ఇవ్వజూపారని ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసును మరింత సమగ్రంగా విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, ఇదే నగరంలోని సాగర్‌కు చెందిన బోదక్‌దేవ్ నివాసానికి సమన్లు పంపినట్లు సమాచారం. ఈ సమన్లకు 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉందని విశ్వసనీయ సమచారం. ఒకవేళ వీటికి స్పందించకపోతే వారికి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందని అందులో అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment