adani foundation
-
‘అన్నీ నిరాధార ఆరోపణలే’.. అదానీగ్రూప్ స్పందన
అదానీ గ్రూప్‌పై తాజాగా చెలరేగిన ఆరోపణలపై కంపెనీ అధికారికంగా స్పందించింది. అదానీ గ్రూప్ సంస్థలపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవి నిరాధారమైనవని కొట్టిపారేసింది. నేరం రుజువు కానంత వరకు వ్యక్తులు, సంస్థలు నిర్దోషులుగానే భావించబడుతారని స్పష్టం చేసింది.అదానీ విడుదల ప్రకటన చేసిన ప్రకటనలో..‘అదానీ గ్రీన్ సంస్థ డైరెక్టర్లపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. యూఎస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తమ అభియోగపత్రంలో తెలిపినట్లు అవి కేవలం ఆరోపణలు మాత్రమే. వాటిలో నిజంలేదు. నేరం రుజువు అయ్యేంత వరకు ఆరోపణలు వచ్చిన వ్యక్తులు, సంస్థలను నిర్దోషులుగా భావిస్తారు. అదానీ గ్రూప్ తన కార్యకలాపాల్లో పారదర్శకత, అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు కట్టుబడి ఉంటుంది. కంపెనీ వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులకు భరోసా కల్పించడంతోపాటు అదానీ గ్రూప్ చట్టాన్ని గౌరవించే సంస్థ’ అని తెలిపింది.Adani Group Spokesperson says, "The allegations made by the US Department of Justice and the US Securities and Exchange Commission against directors of Adani Green are baseless and denied. As stated by the US Department of Justice itself, "the charges in the indictment are… pic.twitter.com/rSuxuHTFUo— ANI (@ANI) November 21, 2024రూ.16,890 కోట్ల కాంట్రాక్టుల కోసం లంచం?20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల(రూ.16,890 కోట్లు) లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వచూపినట్లు అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్‌ల్లో అమెరికా ఇన్వెస్టరల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం ఎఫ్‌బీఐ ద్వారా దర్యాప్తు చేస్తోంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు. -
ఒకేరోజు అదానీ షేర్ల నష్టం రూ.2.6 లక్షల కోట్లు!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దాంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయిన సమయం నుంచి కేవలం అదానీ గ్రూప్ లిస్ట్‌డ్ కంపెనీల నుంచే దాదాపు రూ.2.6 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ప్రతిషేరు సుమారు 20 శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. దాంతో అదానీ గ్రూప్ సంస్థల సంపద రూ.12.3 లక్షల కోట్లకు చేరినట్లు తెలిసింది.ఏయే కంపెనీలు ఎంతే నష్టపోయాయంటే..అదానీ ఎంటర్ప్రైజెస్: 20 శాతంఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్: 20 శాతంఅదానీ గ్రీన్ ఎనర్జీ: 18 శాతంఅదానీ పవర్: 14 శాతంఅదానీ టోటల్ గ్యాస్: 14 శాతంఅంబుజా సిమెంట్స్: 18 శాతంఏసీసీ: 15 శాతంఅదానీ విల్మార్: 10 శాతంఎన్డీటీవీ: 14 శాతంసంఘీ ఇండస్ట్రీస్: 6 శాతంఅసలు కేసేంటి?20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల(రూ.16,890 కోట్లు) లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇవ్వచూపినట్లు అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్‌ల్లో అమెరికా ఇన్వెస్టరల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం ఎఫ్‌బీఐ ద్వారా దర్యాప్తు చేస్తోంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు.డాలర్ డినామినేటెడ్ బాండ్లపై అదానీ ప్రకటనఅమెరికా కేసు అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్‌లో ముందుకువెళ్లకూడదని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం ఎక్స్ఛేంజీలకు ప్రకటన విడుదల చేసింది. ‘అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, యూఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజీ కమిషన్(ఎస్ఈసీ)లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు చేశాయి. కాబట్టి ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. ఈ ఆఫర్ విలువ సుమారు రూ.3,960 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు‘అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే సహించబోం’ఈ వ్యవహారంపై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందించారు. అదానీ సోలార్ ప్రాజెక్ట్‌ల కాంట్రాక్ట్‌ల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఈ అంశంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ కేసును ఎఫ్‌బీఐ న్యూయార్క్ కార్పొరేట్, సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దర్యాప్తు చేస్తున్నాయి. -
ఇండియా గ్రోత్‌కు అదానీ కీలకం.. అమెరికా సంస్థ వెల్లడి
అదానీ గ్రూపు ఇండియా ఎకానమీకి కీలకమని అమెరికాకు చెందిన కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ అండ్ కో తెలిపింది. అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు 50 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించగలదని బ్రెట్ నోబ్లాచ్, థామస్ షిన్స్కే అనే ఎనలిస్టులు అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. భారతదేశం 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఫిట్జ్ గెరాల్డ్ తెలిపింది. అత్యధిక జనాభా కలిగిన దేశం ఆర్థిక ఆశయాలను చేరుకోవడానికి ఇంధన ఉత్పత్తిని పెంచడంతోపాటు, డిజిటల్, సాంకేతిక, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టాలని సూచించింది. ఈ పెట్టుబడులు ఉత్పాదకత, వృద్ధిని పెంచడానికి ఉపయోగపడుతాయని తెలిపింది. చైనాతో పోటీ పడాలంటే పెట్టుబడులు కీలకమని పేర్కొంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఇండియా ఎకనామిక్ గ్రోత్ లక్ష్యాలు సాధించడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కీలకపాత్ర పోషిస్తుందని ఫిట్జ్ గెరాల్డ్ చెప్పింది. కీలక వ్యాపారాల్లో ఈ సంస్థకు భాగస్వామ్యం ఉందని పేర్కొంది. భారతదేశానికి అదానీ గ్రూప్ చాలా అవసరమని వివరించింది. -
రూ.300 కోట్లతో జెట్ విమానాలు కొనుగోలు చేయనున్న అదానీ.. ఎందుకంటే..
అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ తన గ్రూప్‌నకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రయాణ సౌకర్యం కోసం ఆరు జెట్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. అందుకు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీకు చెందిన పిలాటస్ పీసీ-24 మోడల్‌కు చెందిన ఈ ఆరు జెట్ విమానాల కోసం గ్రూప్ ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన జెట్ విమానాలను కర్ణావతి ఏవియేషన్ పర్యవేక్షిస్తుంది. ఈ ఏవియేషన్ రీసేల్ మార్కెట్ నుంచి విమానాలను కొనుగోలు చేస్తూంటుంది. తాజాగా కొనుగోలు చేసిన పిలాటస్ పీసీ-24 మోడల్ జెట్ విమానం 1,406 కిలోల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భూ ఉపరితలం నుంచి 45,000 అడుగుల ఎత్తుకు వెళ్లగలదు. ఇదీ చదవండి: అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే.. 10 సీటర్ సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ 440 నాట్స్ ట్రూ ఎయిర్‌స్పీడ్ వరకు చేరుకోగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వస్తున్న ఈ ఆరు జెట్ విమానాలతో మొత్తం అదానీ గ్రూప్ వద్ద ఉన్న జెట్ ఫ్లైట్స్ సంఖ్య 12కు చేరుకోనుంది. -
మురికివాడ రూపురేఖలు మార్చనున్న అదానీ..?
దేశంలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. పేద, అట్టడుగు వర్గాల వారు నివసించే ఈ ధారావి వాసులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ తీపి కబురందించింది. అర్హులైన నివాసులకు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఫ్లాట్లు అందిస్తామని సోమవారం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ధారావి మురికివాడను రీ డెవలపింగ్ చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఆఫర్ చేసిన ప్రతిపాదన కంటే 17 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే ఫ్లాట్లను ధారావి వాసులకు అందజేస్తామని తెలిపింది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! ధారావి రీడెవలపింగ్ ప్రాంతంలో కమ్యూనిటీ హాళ్లు, రీక్రియేషనల్ ప్రాంతాలు, పబ్లిక్ గార్డెన్స్, డిస్పెన్సరీలు, పిల్లలకు డే కేర్ సెంటర్లు ఉంటాయని సంస్థ వర్గాలు తెలిపాయి. 2018 నుంచి ధారావి వాసులకు ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం కింద 315-322 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇళ్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2000 జనవరి నాటికి ఇక్కడ ఇల్లు ఉన్న వారిని ఈ పథకానికి అర్హులుగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ఓరియంట్ సిమెంట్‌ను కొనబోతున్న అదానీ!
సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో..ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓరియంట్ సిమెంట్ ప్రమోటరు సి.కె.బిర్లా కంపెనీలో తన వాటా అమ్మేందుకు అదానీ గ్రూపు ఛైర్మన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అంబుజా, సంఘీ, ఏసీసీ వంటి ప్రధాన సిమెంటు కంపెనీలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే అదానీ గ్రూపునకు ప్రయోజనం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏసీసీ కార్యకలాపాలకు ఓరియంట్ సిమెంట్ ప్లాంట్లు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్ కొన్ని రోజులుగా పాజిటివ్‌లో ట్రేడవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకు చాలా సిమెంట్ అవసరం అవుతుంది. రోడ్లు, రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఇళ్లను వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. కానీ సిమెంట్ తలసరి వినియోగం చైనాలో 1,600 కిలోగ్రాములు, భారత్ 250 కిలోగ్రాములుగా ఉంది. -
‘అదానీ ఫౌండేషన్..ప్రీతి అదానీ’ ఈ విషయాలు తెలుసా?
సాక్షి,ముంబై: భారతదేశంలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో మూడవ బిలియనీర్ అదానీ గ్రూప్ చైర్మన్, గౌతమ్ అదానీ అని మనందరికి తెలిసిందే. వ్యాపారవేత్తగా గౌతమ్ అదానీ వివిధ వ్యాపారాల్లో దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 1988లో అదానీ గ్రూప్‌ను స్థాపించిన గౌతమ్ అదానీ ప్రస్తుతం నికర విలువ 12,780 కోట్ల డాలర్లు. కానీ అదానీ ఫౌండేషన్ ఫౌండర్ బిలియనీర్ గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ అంటే నమ్ముతారా? ఒక బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలతో విజయవంతమైన బిజినెస్ ఉమెన్‌గా ఖ్యాతి గడించారు ప్రీతి. అదానీ కుటుంబం, ఆయన భార్య పిల్లలు లైమ్‌లైట్‌లో ఉండటానికి పెద్దగా ఇష్టపడరట. అందుకే వారి గురించి తెలిసింది చాలా తక్కువే అని చెప్పాలి. గౌతం, ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. ఇక గౌతం అదానీ భార్య ప్రీతి అదానీ విశేషాల గురించి మాట్లాడుకుంటే డాక్టర్ ప్రీతి అదానీ ప్రీతి అదానీ 1965లో ముంబైలో జన్మించారు. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుండి డెంటల్ సర్జరీలో గ్రాడ్యుయేషన్ చేశారు. డెంటల్ డాక్టర్‌గా కరియర్ ప్రారంభించారు. ఆ తరువాత గౌతం అదానీతో వివాహం. 1996లో అదానీ ఫౌండేషన్ అధ్యక్షురాలయ్యారు. డాక్టర్ ప్రీతి అదానీ- విద్యావేత్త గుజరాత్లో అక్షరాస్యత రేటును పెంచే లక్ష్యంతో ప్రీతి అదానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె నాయకత్వంలో, అదానీ గ్రూప్ CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) బడ్జెట్ రూ. 2018-19లో 128 కోట్లు. అదానీ ఫౌండేషన్ అదానీ ఫౌండేషన్‌ను 1996లో ప్రీతి అదానీ స్థాపించారు. అదానీ ఫౌండేషన్ ప్రారంభించే సమయంలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే అదానీ ఫౌండేషన్ ఇప్పుడు దేశంలోని 18 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ప్రీతి అదానీ నిరుపేద ప్రజల కోసం దాతృత్వ కార్యక్రమాలలో తన సమయాన్ని వెచ్చిస్తారు. ఆరోగ్యవంతమైన ఆహారంకోసం కిచెన్ గార్డెన్ కార్యక్రమాలను ప్రమోట్ చేయాలంటారు ప్రీతి.