రూ.300 కోట్లతో జెట్‌ విమానాలు కొనుగోలు చేయనున్న అదానీ.. ఎందుకంటే.. | Adani Group To Buy Business Jets For Top Executives | Sakshi
Sakshi News home page

రూ.300 కోట్లతో జెట్‌ విమానాలు కొనుగోలు చేయనున్న అదానీ.. ఎందుకంటే..

Published Sat, Jan 27 2024 6:46 PM | Last Updated on Sat, Jan 27 2024 7:03 PM

Adani Group To Buy Business Jets For Top Executives - Sakshi

అదానీ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తన గ్రూప్‌నకు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల ప్రయాణ సౌకర్యం కోసం ఆరు జెట్‌ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. అందుకు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కంపెనీకు చెందిన పిలాటస్‌ పీసీ-24 మోడల్‌కు చెందిన ఈ ఆరు జెట్‌ విమానాల కోసం గ్రూప్‌ ఇప్పటికే ఆర్డర్‌ చేసినట్లు తెలిసింది.

అదానీ గ్రూప్‌నకు చెందిన జెట్‌ విమానాలను కర్ణావతి ఏవియేషన్ పర్యవేక్షిస్తుంది. ఈ ఏవియేషన్‌ రీసేల్ మార్కెట్ నుంచి విమానాలను కొనుగోలు చేస్తూంటుంది. తాజాగా కొనుగోలు చేసిన పిలాటస్‌ పీసీ-24 మోడల్‌ జెట్‌ విమానం 1,406 కిలోల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది  భూ ఉపరితలం నుంచి 45,000 అడుగుల ఎత్తుకు వెళ్లగలదు. 

ఇదీ చదవండి: అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే..

10 సీటర్ సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ 440 నాట్స్ ట్రూ ఎయిర్‌స్పీడ్ వరకు చేరుకోగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వస్తున్న ఈ ఆరు జెట్‌ విమానాలతో మొత్తం అదానీ గ్రూప్‌ వద్ద ఉన్న జెట్‌ ఫ్లైట్స్‌ సంఖ్య 12కు చేరుకోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement