న్యూఢిల్లీ: విభిన్న వ్యాపారాలు కలిగిన అదానీ గ్రూప్ తాజాగా పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్ సంస్థ ఇండోరమా రిసోర్సెస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇండోరమా రిసోర్సెస్‌తో కలిసి అదానీ పెట్రోకెమికల్స్ భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా పేర్కొంది.
పరస్పరం సమాన భాగస్వామ్యం(50:50 శాతం వాటా)తో వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(వీపీఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. జేవీ ద్వారా రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్ బిజినెస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. దశలవారీగా రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్స్, హైడ్రోజన్ తదితర బిజినెస్‌ల కోసమే అదానీ పెట్రోకెమికల్స్‌ను నెలకొల్పినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వివరించింది. 2022లోనే గుజరాత్‌లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!
అదానీ పెట్రోకెమికల్స్‌తో సంబంధం ఉన్న కొన్ని కీలక ఉత్పత్తులు కింది విధంగా ఉన్నాయి.
పీవీసీ ప్లాంట్: అదానీ పెట్రోకెమికల్స్ గుజరాత్‌లోని ముంద్రాలో పాలివినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ సామర్థ్యం 2 మిలియన్ టన్నులు. మొదటి దశ 2026 నాటికి 1 మిలియన్ టన్నులు, రెండో దశ 2027 ప్రారంభం నాటికి మరో 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ యాసిడ్ (పీటీఏ) ప్లాంట్: వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (వీపీఎల్) పేరుతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ మహారాష్ట్రలో 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన పీటీఏ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment