
అదానీ గ్రూపు ఇండియా ఎకానమీకి కీలకమని అమెరికాకు చెందిన కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ అండ్ కో తెలిపింది. అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేరు 50 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించగలదని బ్రెట్ నోబ్లాచ్, థామస్ షిన్స్‌కే అనే ఎనలిస్టులు అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
భారతదేశం 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఫిట్జ్ గెరాల్డ్ తెలిపింది. అత్యధిక జనాభా కలిగిన దేశం ఆర్థిక ఆశయాలను చేరుకోవడానికి ఇంధన ఉత్పత్తిని పెంచడంతోపాటు, డిజిటల్, సాంకేతిక, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టాలని సూచించింది. ఈ పెట్టుబడులు ఉత్పాదకత, వృద్ధిని పెంచడానికి ఉపయోగపడుతాయని తెలిపింది. చైనాతో పోటీ పడాలంటే పెట్టుబడులు కీలకమని పేర్కొంది.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
ఇండియా ఎకనామిక్ గ్రోత్ లక్ష్యాలు సాధించడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కీలకపాత్ర పోషిస్తుందని ఫిట్జ్ గెరాల్డ్ చెప్పింది. కీలక వ్యాపారాల్లో ఈ సంస్థకు భాగస్వామ్యం ఉందని పేర్కొంది. భారతదేశానికి అదానీ గ్రూప్ చాలా అవసరమని వివరించింది.