దేశంలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. పేద, అట్టడుగు వర్గాల వారు నివసించే ఈ ధారావి వాసులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ తీపి కబురందించింది. అర్హులైన నివాసులకు 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఫ్లాట్లు అందిస్తామని సోమవారం తెలిపింది.
మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ధారావి మురికివాడను రీ డెవలపింగ్ చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఆఫర్ చేసిన ప్రతిపాదన కంటే 17 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే ఫ్లాట్లను ధారావి వాసులకు అందజేస్తామని తెలిపింది.
ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా!
ధారావి రీడెవలపింగ్ ప్రాంతంలో కమ్యూనిటీ హాళ్లు, రీక్రియేషనల్ ప్రాంతాలు, పబ్లిక్ గార్డెన్స్, డిస్పెన్సరీలు, పిల్లలకు డే కేర్ సెంటర్లు ఉంటాయని సంస్థ వర్గాలు తెలిపాయి. 2018 నుంచి ధారావి వాసులకు ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం కింద 315-322 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇళ్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2000 జనవరి నాటికి ఇక్కడ ఇల్లు ఉన్న వారిని ఈ పథకానికి అర్హులుగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment