Aircraft aeroplanes
-
రూ.300 కోట్లతో జెట్ విమానాలు కొనుగోలు చేయనున్న అదానీ.. ఎందుకంటే..
అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ తన గ్రూప్‌నకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రయాణ సౌకర్యం కోసం ఆరు జెట్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. అందుకు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీకు చెందిన పిలాటస్ పీసీ-24 మోడల్‌కు చెందిన ఈ ఆరు జెట్ విమానాల కోసం గ్రూప్ ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన జెట్ విమానాలను కర్ణావతి ఏవియేషన్ పర్యవేక్షిస్తుంది. ఈ ఏవియేషన్ రీసేల్ మార్కెట్ నుంచి విమానాలను కొనుగోలు చేస్తూంటుంది. తాజాగా కొనుగోలు చేసిన పిలాటస్ పీసీ-24 మోడల్ జెట్ విమానం 1,406 కిలోల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భూ ఉపరితలం నుంచి 45,000 అడుగుల ఎత్తుకు వెళ్లగలదు. ఇదీ చదవండి: అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే.. 10 సీటర్ సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ 440 నాట్స్ ట్రూ ఎయిర్‌స్పీడ్ వరకు చేరుకోగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వస్తున్న ఈ ఆరు జెట్ విమానాలతో మొత్తం అదానీ గ్రూప్ వద్ద ఉన్న జెట్ ఫ్లైట్స్ సంఖ్య 12కు చేరుకోనుంది. -
చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్లో ప్రవేశం
తైవాన్: చైనా దేశం తైవాన్‌పై మరోసారి బలప్రదర్శనకు దిగింది. తమ యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది. మొత్తం 27 విమానాలు బఫర్ జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తమ యుద్ధవిమానాల ద్వారా హెచ్చరించగా.. చైనా విమానాలు పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెనుతిరిగాయని అధికారులు తెలిపారు. చదవండి: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రకంపనలు..భారత్‌లోనూ దడ ఏడాది కాలంగా తైవాన్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుతూ.. చైనా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కిపైగా యుద్ధ విమానాలను తైవాన్ దేశం మీదకు వెళ్లాయి. కాగా, తైవాన్ను తన అంతర్భాగంగా చెబుతున్న చైనా.. ఆ దేశాన్ని పూర్తిగా తమలో కలుపుకుంటామని, అవసరమైతే సైనిక చర్యకూ వెనకాడబోయేది లేదంటోంది. -
వినువిందు
భవానీపురం, ఎయిర్ షో, ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు Bhavanipuram, Air Show, Aircraft aeroplanes విజయవాడ (భవానీపురం) : పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో మూడు రోజులపాటు చేపట్టిన ఎయిర్ షో రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. వినీలాకాశంలో విహంగాలు చేసిన విన్యాసాలను పున్నమి, భవానీఘాట్‌ల నుంచి సందర్శకులు రెప్పవేయకుండా తిలకించారు. ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు ఇంద్రకీలాద్రి కొండ పై నుంచి చక్కర్లు కొడుతుంటే ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఒక్కో సమయంలో నాలుగు విమానాలు ఒకదానికొకటి ఢీ కొంటాయేమో అన్నట్టుగా పైలెట్లు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. ఎయిర్ షోను వీక్షించేందుకు ఆర్టీసీ ఎండీ పూనం మాలకొండయ్య కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ షో శనివారం కూడా కొనసాగుతుంది.