వినువిందు
భవానీపురం, ఎయిర్ షో, ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు
Bhavanipuram, Air Show, Aircraft aeroplanes
విజయవాడ (భవానీపురం) : పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో మూడు రోజులపాటు చేపట్టిన ఎయిర్ షో రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. వినీలాకాశంలో విహంగాలు చేసిన విన్యాసాలను పున్నమి, భవానీఘాట్‌ల నుంచి సందర్శకులు రెప్పవేయకుండా తిలకించారు. ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు ఇంద్రకీలాద్రి కొండ పై నుంచి చక్కర్లు కొడుతుంటే ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఒక్కో సమయంలో నాలుగు విమానాలు ఒకదానికొకటి ఢీ కొంటాయేమో అన్నట్టుగా పైలెట్లు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. ఎయిర్ షోను వీక్షించేందుకు ఆర్టీసీ ఎండీ పూనం మాలకొండయ్య కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ షో శనివారం కూడా కొనసాగుతుంది.