Bhavanipuram
-
యూట్యూబ్ చానల్ ప్రతినిధుల నిర్వాకం
సాక్షి, భవానీపురం(విజయవాడ): ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్ చానల్స్‌లో పనిచేస్తున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది జర్నలిజం పట్ల నిబద్ధత కలిగి నిజాలను వెలికి తీస్తూ నిజాయతీగా వ్యవహరించే పాత్రికేయులకు తలవంపులుగా మారింది. సేకరించిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు శనివారం భవానీపురం బ్యాంక్ సెంటర్లోని సుధాకర్ మెడికల్ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము వన్ టీవీ న్యూస్ ప్రతినిధులమని, యాడ్ ఇవ్వాలని అడిగారు. తమది చిన్న మెడికల్ షాపని, యాడ్ ఇచ్చే పరిస్థితిలో లేమని, షాప్‌వారు తెలపడంతో తమకు టార్గెట్లు ఉంటాయని, కనీసం రూ.5వేల యాడ్ ఇవ్వాలని వారు అడిగారు. ఇవ్వలేమని, తమకు ఆ అవసరంకూడా లేదని నిర్వాహకులు తేల్చి చెబుతూ ఐడీ కార్డు చూపమని అడిగారు. ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే తన ఐడీ కార్డ్ బయటపెట్టారు. దానిపై మట్టా రవికుమార్, కంట్రిబ్యూటర్, మైలవరం అని ఉంది. రెండవ వ్యక్తి తన ఐడీకార్డు ఆఫీస్‌లో ఉందని చెప్పారు. తమకు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు తెలుసునని, వారితో చెప్పి మీపై ఏదో ఒక కేసు బనాయిస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి సంస్థకు చెందిన లోగో బయటకు తీసి హడావుడి చేశారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరి మెడికల్ షాపు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటంతో వారు నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై భవానీపురం ఇన్చార్జి సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వన్ టీవీ ప్రతినిధి ఐడీ కార్డు, కారు ∙ఇదే యూట్యూబ్ చానల్‌కు చెందిన పి.సురేష్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని గత ఏడాది సెప్టెంబర్ 13న విజయవాడ ఊర్మిళానగర్‌లో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న ఒక దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేసి రూ.1000 వసూలు చేశారు. దీనిపై ఆమె భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిటీ ఎస్ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించిన గుత్తుల ప్రశాంత్ అనే వ్యక్తి కారులో వస్తుండగా ఈ ఏడాది జూన్ 25న భవానీపురం పోలీసులు గొల్లపూడిలో పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను వీ వన్ చానల్ రిపోర్టర్నని ఐడీ కార్డ్ చూపించాడు. కారు నంబర్ ప్లేట్లుకూడా మార్చిన అతన్ని విడిపించేందుకు అప్పట్లో కొందరు పెద్దఎత్తున లాబీయింగ్ చేశారని వినికిడి. -
పోలీసుల చొరవతో బయటపడ్డ బాలుడు
సాక్షి, విజయవాడ: పట్టణంలోని భవానీపురం లేబర్ కాలనీలో ఆరేళ్ల బాలుడు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను కలవరానికి గురిచేసింది. అయితే, భవానీపురం పోలీసుల చొరవతో బాలుడు క్షేమంగా బయటడపటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఊపిరి అందక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న బాలుడి విషయం తెలియగానే.. భవానీపురం ఎస్సై కవిత శ్రీ,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు, కానిస్టేబుల్ చలపతి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గోడలో ప్రమాదవశాత్తు ఇరుకు పోయిన బాలుడిని చాకచక్యంగా కాపాడారు. భవానీపురం పోలీసులు వేగంగా స్పందించడంతో బాలుడికి ప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపించారు. -
పోలీసుల సమయస్ఫూర్తితో బాలుడికి తప్పిన ప్రమాదం
-
పద్మావతి హత్యకేసులో పురోగతి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీపురంలో జరిగిన మహిళ దారుణ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్తుడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆరేళ్లుగా నిందితుడు పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడుతున్నాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ సంఘటనతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన పని లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. కాగా ఒంటరిగా ఉన్న మహిళను గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం విజయవాడ భవానీపురంలో జరిగిన విషయం తెలిసిందే. భవానీపురం క్రాంబ్వే రోడ్‌కు అనుసంధానంగా ఉన్న కెనరా బ్యాంక్ రోడ్లో యేదుపాటి వెంకటేశ్వర్లు, పద్మావతి(55) దంపతులు నివసిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఇసుక, ఇటుక, కంకర వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్మెంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. భార్య పద్మావతిని ఇంటి దగ్గర దింపేసిన వెంకటేశ్వర్లు పనులపై బయటకు వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన తరువాత పద్మావతి తమ సమీప బంధువుకు ఫోన్ చేశారు. అయితే, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్లో మిస్డ్ కాల్ చూసుకున్న బంధువు తిరిగి పద్మావతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన తీరు చూస్తుంటే పాత నేరస్తుల పని అయి ఉంటుందని భావిస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. దుండగులు పద్మావతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారని చెప్పారు. బాధితురాలి ఒంటిపై ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపారు. కప్ బోర్డ్‌లో ఉన్న నగలు, నగదు ముట్టుకోలేదని తెలుస్తోందన్నారు. వేలి ముద్రలు కనిపించకుండా కారం చల్లారని చెప్పారు. గతంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరిగిన హత్య కేసులో దొరికిన వేలి ముద్రలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్తుడి వేలి ముద్రలతో సరిపోయాయని, అయితే సదరు నేరగాడు ఇంకా దొరకలేదని అన్నారు. పద్మావతి హత్య కూడా ఆ తరహాలోనే జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్ నేరస్తుల పనేనా అన్నది విచారణలో తేలుతుందన్నారు. కాగా, డాగ్ స్క్వాడ్ టీమ్ తీసుకొచ్చిన జాగిలం పీఆర్కే బిల్డింగ్ వద్ద కాసేపు ఆగి, తిరిగి స్వాతి సెంటర్ వరకు వెళ్లింది. -
కిలాడీ ‘యాప్’తో జర జాగ్రత్త!
సాక్షి, అమరావతి : సైబర్ నేరాల్లో సరికొత్త బురిడీ విజయవాడ కమిషనరేట్ పరిధిలో బహిర్గతమైంది. ‘ఎనీ డెస్క్’ యాప్‌తో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే నేరాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భవానీపురం వాసిని సైబర్ నేరస్తులు ఇదే తరహాలో మోసం చేసి రూ.68 వేలు కొల్లగొట్టారు. బాధితుడి చరవాణిలోకి చొరబడి బ్యాంకు ఖాతాల వివరాలను తస్కరించి ఈ నేరానికి పాల్పడ్డారు. నకిలీ కస్టమర్ కేర్ నంబరుతో వల విజయవాడ భవానీపురానికి చెందిన ఓ యువకుడు గత ఫిబ్రవరి 25వ తేదీన తన ఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెయ్యి రూపాయలు ఆంధ్రా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేందుకు ప్రయత్నించాడు. అందులో విఫలం కావడంతో ఇంటర్నెట్లో ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ ఫోన్ నంబరు కోసం వెతికాడు. సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్‌కేర్ నంబరును ఇంటర్నెట్లో నమోదు చేసిన విషయం తెలియని బాధితుడు.. ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు. అదే అదనుగా బాధితుడికి ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ 9939017073 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ కాలేదని ఫిర్యాదు చేశారా?’ అని ప్రశ్నించగా భవానీపురం వాసి ‘అవును’ అని సమాధానం ఇవ్వగా.. ‘మీకు ఫోన్‌పే, గూగుల్‌పే యాప్స్ ఉన్నాయా?’ అని అటు నుంచి మళ్లీ అడిగారు. ‘గూగుల్‌పే లేదు నా ఫోన్లో ఫోన్‌పే మాత్రమే ఉంది’ అని వివరించాడు. అయితే ఆ సమయంలో బాధితుడి ఫోన్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడం అతడి తమ్ముడి ఫోన్లో నుంచి కస్టమర్‌కేర్ సభ్యుడితో మాట్లాడుతూ అతడు చెప్పినట్లు ఫోన్‌పే ఆపరేట్ చేస్తుండగా.. ‘మీకు ఆపరేట్ చేయడం సరిగా రావడం లేదు’ అంటూ బాధితుడి ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్‌ను నిక్షిప్తం చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. ఆ తరువాత ఎనీడెస్క్ యాప్ ద్వారా వచ్చే కోడ్‌ను చెప్పమని నేరస్తుడు చెప్పడంతో అలాగే చేశారు. అనంతరం ఐదు నిమిషాలకే బాధితుడికి చెందిన యాక్సిస్, ఆంధ్రాబ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు మాయమైపోయింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.43 వేలు, మళ్లీ నిమిషానికి ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి రూ.20 వేలు, మరొకసారి రూ.5 వేలు మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. విషయం గ్రహించిన బాధితుడు విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాప్ చొరబడితే అంతే.. అంతర్జాల సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎనీడెస్క్ యాప్‌ను నిక్షిప్తం చేస్తే ఇక అంతే సంగతులు అని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ ఏ ఫోన్లో ఉంటుందో.. అందులోని సమస్త సమాచారాన్ని సైబర్ నేరస్తులు వీక్షించే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో బాధితుల ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల క్రమంలో చరవాణికి వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లూ నేరస్తులకు కనిపిస్తాయి. అందుకే ఆ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో నిక్షిప్తం చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు. -
ఈవెంట్ యాంకర్లతో అసభ్య నృత్యాలు!
సాక్షి, విజయవాడ : నగరంలోని భవానీపురంలో ఉన్న ఆలీవ్ ట్రీ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. ఐదుగురు మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో హోటల్లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి హోటల్లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం. పోలీసుల దాడిలో మరో ఐదుగురు యాంకర్లని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, 15 మందిని భవానీపురం పీఎస్‌కు, 10 మందిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు, మరో పదిమందిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు. ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విహయవాడకు చెందిన వారిగా గుర్తించారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబ సభ్యుడు కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడని, అయితే, పోలీసుల రైడ్ నుంచి అతన్ని తప్పించారని తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ప్రతినెలా ఇదే తరహాలో నగరంలో పార్టీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో తొలి ముజ్రా పార్టీ కేసు! అమ్మాయిల అసభ్య నృత్యాల నేపథ్యంలో నగరంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ముజ్రా పార్టీకి సంబంధించి 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. హోటల్ నిర్వాహకులపైనా కేసు పెట్టామని చెప్పారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని తెలిపారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వినువిందు
భవానీపురం, ఎయిర్ షో, ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు Bhavanipuram, Air Show, Aircraft aeroplanes విజయవాడ (భవానీపురం) : పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో మూడు రోజులపాటు చేపట్టిన ఎయిర్ షో రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. వినీలాకాశంలో విహంగాలు చేసిన విన్యాసాలను పున్నమి, భవానీఘాట్‌ల నుంచి సందర్శకులు రెప్పవేయకుండా తిలకించారు. ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు ఇంద్రకీలాద్రి కొండ పై నుంచి చక్కర్లు కొడుతుంటే ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఒక్కో సమయంలో నాలుగు విమానాలు ఒకదానికొకటి ఢీ కొంటాయేమో అన్నట్టుగా పైలెట్లు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. ఎయిర్ షోను వీక్షించేందుకు ఆర్టీసీ ఎండీ పూనం మాలకొండయ్య కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ షో శనివారం కూడా కొనసాగుతుంది. -
విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గం ఎన్నిక
విజయవాడ(భవానీపురం) : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిౖకెంది. భవానీపురంలోని సాయి అన్న గార్డె¯Œ్సలో సోమవారం డిస్కం అధ్యక్షుడు డి.నాగరాజు అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిశ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ ఖాతాదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ¯ŒS.వి.నరసింహారావు (నందిగామ), వర్కింగ్ అధ్యక్షుడిగా ఎ.ఇ.ప్రసాద్ (పెడన), ఉపాధ్యక్షుడిగా ఎస్.ఎస్.ఎస్.రాజు (నూజివీడు), కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు (విజయవాడ–భవానీపురం), కోశాధికారిగా ఎం.రామ సుధాకర్ (ముదినేపల్లి), లైజా¯ŒS ఆఫీసర్‌గా సీహెచ్ వెంకటేశ్వర్లు (విజయవాడ–ఆటోనగర్), జాయింట్ సెక్రటరీగా పి మధుబాబు(మచిలీపట్నం), అడ్మినిసే్ట్రటివ్ సెక్రటరీగా ఎం.తాతారావు (గుడివాడ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి.బసవశాస్తుల్రు (నాగా యలంక), ప్రచార కార్యదర్శిగా ఎం.డి.రంజా¯ŒS (జగ్గయ్య పేట), మహిళా ప్రతినిధిగా ఎస్కె.ఖాసింబీ (సర్కిల్ ఆఫీస్) ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో ఐదుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. డిస్కం అధ్యక్ష కార్యదర్శులు డి.నాగరాజు, ఎం.శ్రీధర్, పి.విజయభాస్కర్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆల్ సోల్స్ డే
ఆల్ సోల్స్ డే (సమస్త ఆత్మల దినం) సందర్భంగా భవానీపురంలోని క్రైస్తవ శ్మశానవాటికలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. సమాధులన్నీ పూలతో అలంకరించారు. కొవ్వొత్తులు, అగరబత్తీలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధుల వద్ద తమవారి స్మృతులను గుర్తుచేసుకుంటూ మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారు. తమ బంధువులు, ఫాదర్ల సమాధుల వద్దకు వచ్చి ప్రార్థనలు చేసిన సిస్టర్స్ ఖాళీగా ఉన్న సమాధులపై కూడా పూలు పెట్టి, కొవ్వొత్తులు వెలిగించారు. కొంత మంది పాస్టర్లు, ఫాదర్స్‌ను పిలిపించుకుని సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. – భవానీపురం -
కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
-
కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
విజయవాడ: విజయవాడ భవానీపురంలోని ఊర్మిళానగర్‌లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఊర్మిళనగర్‌లో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఈ పనుల్లో పాల్గొనేందుకు ఏడుగురు కార్మికులు ఈ రోజు ఉదయం నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకుని పనులు ప్రారంభించారు. అందులోభాగంగా వారు రేకుల షెడ్ నిర్మిస్తున్నారు. వారిలో ఒకరు హైటెన్షన్ వైర్లను తాకడంతో షాక్ కొట్టింది. అతడి రక్షించేందుకు మిగిలిన ఆరుగురు ప్రయత్నించారు. ఆ క్రమంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు
- సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ భవానీపురం : నూజివీడు రోడ్డు నుంచి రామవరప్పాడు వరకు నిర్మించే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజధానిప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ(సీఆర్డీఎ) కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్ జిల్లా ఉన్నతాధికారులను కోరారు. సీఆర్డీఏ కార్యాలయంలో ఆయన గురువారం సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సమక్షంలో స్థలాల యజమానులతో చర్చించారు. విజయవాడ అర్బన్ పరిధిలోని పాయకాపురం, గుణదల గ్రామాల్లో 1719 చదరపు గజాల భూసేకరణకు అవార్డు విచారణ పూర్తి చేశామన్నారు. పాయకాపురానికి చెందిన 277 చదరపు గజాల భూమి యజమాని ఎన్వీఎస్ ప్రకాశరావు నష్టపరిహారం పెంపు కోరుతూ కోర్టులో వాజ్యం వేశారని తెలిపారు. దీనిపై కలెక్టర్ బాబు.ఎ స్పందిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి ఉన్న విలువపై ప్రస్తుతం రూ.37 లక్షల నష్టపరిహారం, దానిపై 12 శాతం వడ్డీ ఇస్తామని ప్రకాశ రావుకు తెలిపారు. గుణదలలో రింగ్‌రోడ్ నిర్మాణం పరిధిలో 458 చ.గజాలలో ఉన్న చర్చిని వేరే చోటకు తరలించేందుకు 10 రోజులలో నష్టపరిహారం చెల్లించేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. కుందావారి కండ్రిక, నున్న, రామవరప్పాడు, గుణదల గ్రామాలలోని 5,922 చ.గజాల స్థల సేకరణపై సెక్షన్ 11(1) ప్రకారం ప్రతిపాదనలు పంపామని సీఆర్డీఎ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నున్న గ్రామానికి చెందిన 2719 చ.గజాల స్థలం ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ స్థలయజమానులు సుబ్రహ్మణ్యం తదితరులు కలెక్టర్‌కు తెలిపారు. ఫ్లైవోవర్ సమీపంలో ఆక్రమించుకుని వాణిజ్య ప్రయోజనాలకు భూమిని వినియోగిస్తున్న పట్టపురాజు రాజేశ్వరరావుకు వేరే ప్రాంతంలో స్థలం కేటాయించి సబ్సిడీతోకూడిన బ్యాంక్ రుణం ఇచ్చేందుకు కలెక్టర్ హమీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాదాల నివా రణకు ఇన్నర్ రింగ్‌రోడ్డు ఆవశ్యకత గుర్తించాలని స్థల యజమానులను సీపీ కోరారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ కె.శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ భవానీపురంలో లారీ బీభత్సం..
-
పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన లారీ, ఇద్దరు మృతి
విజయవాడ: విజయవాడ భవానీపురంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ డౌన్ అయిన లారీని స్టార్ట్ చేసే క్రమంలో అదుపుతప్పి పుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయవాడ నగరంలో భవానిపురంలో రావిచెట్టు సెంటర్ వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటలకు జరిగింది. వివరాలు.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్క్రాఫ్ లోడుతో వెళ్తున్న లారీ భవానిపురం రావిచెట్టు సెంటర్ వద్దకు రాగానే బ్రేక్ డౌన్ అయింది. రోడ్డుపై ఉన్న లారీని తొలగించడానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో క్రేన్ డ్రైవర్(హోంగార్డు), లారీ డ్రైవరు, క్లీనర్‌ను లారీని తోయమని కోరి తాను లారీని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు లారీని హోంగార్డు అదుపుచేయలేకపోమడంతో అదుపుతప్పి పుట్‌పాత్ పైకి దూసుకుపోయింది. దీంతో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న గుర్తు తెలియని బిచ్చగాళ్లు పురుషుడు(55), ఒక మహిళ(50) మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదే హలను పోస్ట్‌మార్టం కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.