
విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గం ఎన్నిక
విజయవాడ(భవానీపురం) : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిౖకెంది. భవానీపురంలోని సాయి అన్న గార్డె¯Œ్సలో సోమవారం డిస్కం అధ్యక్షుడు డి.నాగరాజు అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిశ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ ఖాతాదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ¯ŒS.వి.నరసింహారావు (నందిగామ), వర్కింగ్ అధ్యక్షుడిగా ఎ.ఇ.ప్రసాద్ (పెడన), ఉపాధ్యక్షుడిగా ఎస్.ఎస్.ఎస్.రాజు (నూజివీడు), కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు (విజయవాడ–భవానీపురం), కోశాధికారిగా ఎం.రామ సుధాకర్ (ముదినేపల్లి), లైజా¯ŒS ఆఫీసర్‌గా సీహెచ్ వెంకటేశ్వర్లు (విజయవాడ–ఆటోనగర్), జాయింట్ సెక్రటరీగా పి మధుబాబు(మచిలీపట్నం), అడ్మినిసే్ట్రటివ్ సెక్రటరీగా ఎం.తాతారావు (గుడివాడ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి.బసవశాస్తుల్రు (నాగా యలంక), ప్రచార కార్యదర్శిగా ఎం.డి.రంజా¯ŒS (జగ్గయ్య పేట), మహిళా ప్రతినిధిగా ఎస్‌కె.ఖాసింబీ (సర్కిల్ ఆఫీస్) ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో ఐదుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. డిస్కం అధ్యక్ష కార్యదర్శులు డి.నాగరాజు, ఎం.శ్రీధర్, పి.విజయభాస్కర్ పాల్గొన్నారు.