విజయవాడ భవానీపురంలోని ఊర్మిళానగర్లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.