కరెంట్ షాక్తో ఐదుగురు మృతి
విజయవాడ: విజయవాడ భవానీపురంలోని ఊర్మిళానగర్లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఊర్మిళనగర్లో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఈ పనుల్లో పాల్గొనేందుకు ఏడుగురు కార్మికులు ఈ రోజు ఉదయం నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు చేరుకుని పనులు ప్రారంభించారు. అందులోభాగంగా వారు రేకుల షెడ్ నిర్మిస్తున్నారు. వారిలో ఒకరు హైటెన్షన్ వైర్లను తాకడంతో షాక్ కొట్టింది. అతడి రక్షించేందుకు మిగిలిన ఆరుగురు ప్రయత్నించారు. ఆ క్రమంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.