jet flights
-
రూ.300 కోట్లతో జెట్ విమానాలు కొనుగోలు చేయనున్న అదానీ.. ఎందుకంటే..
అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ తన గ్రూప్‌నకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రయాణ సౌకర్యం కోసం ఆరు జెట్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. అందుకు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీకు చెందిన పిలాటస్ పీసీ-24 మోడల్‌కు చెందిన ఈ ఆరు జెట్ విమానాల కోసం గ్రూప్ ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన జెట్ విమానాలను కర్ణావతి ఏవియేషన్ పర్యవేక్షిస్తుంది. ఈ ఏవియేషన్ రీసేల్ మార్కెట్ నుంచి విమానాలను కొనుగోలు చేస్తూంటుంది. తాజాగా కొనుగోలు చేసిన పిలాటస్ పీసీ-24 మోడల్ జెట్ విమానం 1,406 కిలోల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భూ ఉపరితలం నుంచి 45,000 అడుగుల ఎత్తుకు వెళ్లగలదు. ఇదీ చదవండి: అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే.. 10 సీటర్ సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ 440 నాట్స్ ట్రూ ఎయిర్‌స్పీడ్ వరకు చేరుకోగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వస్తున్న ఈ ఆరు జెట్ విమానాలతో మొత్తం అదానీ గ్రూప్ వద్ద ఉన్న జెట్ ఫ్లైట్స్ సంఖ్య 12కు చేరుకోనుంది. -
శ్రీకాకుళం: సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌జెట్ ఒకటి కలకలం సృష్టించింది. కాగా, చేపలవేటకు వెళ్లిన మత్య్సకారులకు నీటిపై తేలియాడుతూ డ్రోన్ జెట్ కనిపించింది. దీంతో, వారు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు దీన్ని ఎవరు ప్రయోగించారు?, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, దానిపై ఉన్న అక్షరాలను బట్టి పోలీసులు కోడ్ చేస్తున్నారు. అయితే, ఇది విదేశాలకు చెందినదా?.. లేక స్వదేశంలో తయారైందా? అనే కోణంలో కూడా ఢిల్లీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మరోవైపు, వాతావరణ శాఖకు చెందిన, అంతరిక్ష పరిశోధనాల్లో ఇలాంటి డ్రోన్ జెట్లను శాస్త్రవేత్తలు వాడుతుంటారని సమాచారం. ఇక, దీన్ని ఎవరి ప్రయోగించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రోన్‌పై ఈస్ట్ కోస్ట్ నావల్ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని ఎలాంటి కెమెరాలు లేవు. కానీ.. రేడియో సిగ్నల్స్‌ను పంపే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రం ఉన్నట్టు సమాచారం. -
అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనాకు చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాలపై దాదాపుగా ఢీ కొట్టబోయింది. చైనా జెట్ అత్యంత ప్రమాదకరంగా దూసుకు రావడంతో అమెరికా నిఘా విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ముప్పుని తప్పించారు. ఇది డిసెంబర్ 21న జరిగిందని అమెరికా ఇండో ఫసిఫిక్ కమాండ్ వెల్లడించింది. ‘‘అమెరికా వైమానిక దళానికి చెందిన ఆర్సీ–135 దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తుండగా చైనా జే–11 ఫైటర్ జెట్ కేవలం 6 మీటర్ల (20 అడుగులు) దూరంలోకి వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పనయింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో మేం యథావిధిగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే చైనా ఇలా యుద్ధ విమానాలతో సవాల్ విసురుతోంది’’ అంటూ నిందించింది. 2001లో చైనా చేసిన ఇలాంటి పని వల్ల ఆ దేశ విమానం కుప్పకూలి పైలట్ దుర్మరణం పాలయ్యాడని గుర్తు చేసింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చినా డ్రాగన్ దేశం వెనక్కి తగ్గడం లేదు. అక్కడ అమెరికా యుద్ధ విమానాలను, నౌకలను మోహరిస్తూ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించడం దానికి మింగుడు పడడం లేదు. అమెరికా తన నిఘా కార్యకలాపాలతో చైనాకు పెనుముప్పుగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామని స్పష్టం చేశారు. -
విమానంలో అద్భుతమైన ఘట్టం...30 ఏళ్ల తర్వాత....
విద్యార్థి జీవితంలో టీచర్లు చాల కీలకమైన పాత్ర పోషిస్తారు. వారు బోధనతో మన జీవితాలపై చెరగని ముద్ర వేస్తారు. మనం ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మన చిన్ననాటి ఉపాధ్యాయులను కలవడం అత్యంత అరుదు. అదీగాక బిజీ లైఫ్, పలు పనుల ఒత్తిడితో కలిసే అవకాశం రాకపోవచ్చు. అనుకోకుండా మన చిన్ననాటి స్కూల్ టీచర్ ఎదురుపడితే ఎవ్వరైనా మాటల్లో చెప్పలేనంత ఆనందం తోపాటు ఒక విధమైన భావోద్వేగానికి గురవుతాం. అచ్చం అలానే ఇక్కడొక ఫ్లైట్ అటెండెంట్ ఆ విధమైన గొప్ప అనుభూతిని పొందింది. వివరాల్లోకెళ్తే...కెనడాలోని జెట్ సీఎస్ఏ విమానంలో లోరీ అనే ఒక ఫ్లైట్ అటెండెంట్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలిని చూస్తుంది. దీంతో పట్టరాని ఆనందంతో విమానంలోని మైక్రోఫోన్‌తో ప్రయాణికులను చూస్తూ మాట్లాడుతుంది. ఈ మేరకు ఫ్లైట్ అటెండెంట్ భావోద్వేగంగా మాట్లాడుతూ...."ఈ విమానంలో నా చిన్ననాటి ఉపాధ్యాయురాలు ఉంది. ఆమెను 1990 తర్వాత చూసిందే లేదు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆమెను ఇప్పుడే చూడటం. ఆమె నన్ను షేక్స్పియర్ని ప్రేమించేలా చేసింది. పియానో వాయించేలా చేసింది. అంతేకాదు పియానాలో మాస్టర్స్ చేశాను. ఒక వ్యాసం కూడా రాయగలను. ధన్యవాదాలు ఓకానెల్ అంటూ తన గురువు పేరుని చెబుతుంది." అంతేగాదు చిన్నపిల్లలా ఆనందంతో పరుగెత్తుకుంటూ తన టీచర్ వద్దకు వెళ్తుంది. ఈ ఘటన అనుహ్యంగా ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజున జరగడం విశేషం. ఈ క్రమంలో సదరు ఎయిర్వేస్ కూడా ఇది చాల అద్భుతమైన క్షణం, టీచర్స్ డే రోజునే దీన్ని మాతో పంచుకున్నందుకు లోరీకి ఆమె టీచర్‌కి ధన్యావాదాలు అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు కియోనా థ్రాషెర్ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Keona Thrasher (@vancouver_kthrasher) (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
పెళ్లి కోసం ప్రైవేట్ జెట్ బుక్ చేసిన పెళ్లి పెద్దలు
-
పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ షాక్
పారిస్: పాకిస్తాన్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి గతంలో విక్రయించిన మిరేజ్ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థ, అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునీకరించకూడదని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తీరును తప్పుపడుతూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. తమ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తామని మేక్రాన్ ప్రకటించడమే ఇందుకు కారణం. పాక్ తీరుతో ఆగ్రహంతో ఉన్న ఫ్రాన్స్ మిరేజ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయరాదని నిర్ణయానికి వచ్చింది. ఖతార్‌కు ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్లను విక్రయించింది. ఈ జెట్ల సర్వీసింగ్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న నిపుణులకు నియమించరాదని ఖతార్‌ను ఆదేశించింది. ఆశ్రయం కోరుతూ పాకిస్తాన్ పౌరుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను ఫ్రాన్స్ పక్కనపెడుతోంది. -
రఫేల్ తొలి భారత పైలట్ హిలాల్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్ కామడొర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు. కశ్మీర్‌కు చెందిన హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుంచి వస్తున్న తొలి బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం పొందారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా రఫేల్‌ను మార్చే ప్రక్రియలోనూ ఆయన పాలు పంచుకున్నారు. భారత వైమానిక దళ అధికారిగా మిరేజ్ 2000, మిగ్ 21, కిరణ్ యుద్ధ విమానాలపై 3 వేల ఫ్లైయింగ్ అవర్స్‌ను విజయవంతంగా, ప్రమాద రహితంగా ముగించిన చరిత్ర ఆయనకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్‌గా ఘనత సాధించారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో హిలాల్ జన్మించారు. ఆయన తండ్రి మొహమ్మద్ అబ్దుల్లా రాథోడ్ జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేశారు. తన కెరీర్లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్‌ను హిలాల్ సాధించారు. -
జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్
-
పొలాల్లో జెట్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, అనంతపురం: సాంకేతిక లోపం కారణంగా ఓ జెట్ విమానం అనంతపురం జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సోమవారం ఉదయం బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని పొలాల్లో జెట్ ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. అయితే అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం మైసూర్ నుంచి బళ్లారిలోని జిందాల్ ఫ్యాక్టరీకి వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దూరమెంతైనా..దూసుకెళ్లడమే..!
నిదానమే ప్రధానం అంటారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతీ సెకను ఎంతో విలువైనది. సమయాన్ని వీలైనంత ఆదా చేసి.. త్వరగా గమ్యాన్ని చేరుకోవడానికే అందరూ ప్రాధాన్యమిస్తున్నారు. సమయాన్ని ఆదా చేయడంలో ప్రయాణ సాధనాలు ప్రముఖమైనవి. ఇప్పటివరకున్న మన ప్రయాణ సాధనాలైన బస్సు గంటకు 100–120 కి.మీ., అయస్కాంతాలపై నడిచే రైళ్లు 400–500 కి.మీ., విమానం 1,000–1,300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. ప్రస్తుతం పరిశోధన దశల్లో ఉన్న హైపర్‌లూప్ స్పీడూ కొంచెం అటు ఇటుగా విమానంతో సమానం..! మరీ ఇంతకంటే వేగంగా వెళ్లాలని మనం ఎంతగా అనుకున్నా మార్గం మాత్రం లేదు! అయితే ఇది ఇప్పటి పరిస్థితి.. భవిష్యత్‌లో గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సరికొత్త విమానాలు వచ్చేస్తాయి! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అంత వేగం..సాధ్యమేనా? గంటకు 6 వేల కిలోమీటర్ల వేగమంటే.. హైదరాబాద్ నుంచి న్యూయార్క్ చేరేందుకు 2 గంటల సమయం. తూర్పు వైపున ఉన్న మెల్బోర్న్ వెళ్లాలంటే గంటన్నర. అబ్బో.. అంతవేగం సాధ్యమేనా? భేషుగ్గా సాధ్యమే అంటోంది యూకే అంతరిక్ష పరిశోధన సంస్థ. కాకపోతే విమానాల్లో సినర్జిటిక్ ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ ఇంజిన్.. క్లుప్తంగా సేబర్ ఇంజిన్ వాడాల్సి ఉంటుంది. వీటిని ఆక్స్ఫర్డ్ షైర్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ‘రియాక్షన్ ఇంజిన్స్’ తయారు చేస్తోంది. ఈ ఇంజిన్లు అమర్చిన విమానాలు ధ్వనికి సుమారు 5.5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. కచి్చతంగా చెప్పాలంటే గంటకు 4,143 మైళ్లు లేదా.. గంటకు 6,667.512 కి.మీ.ల వేగమన్నమాట! ఉపగ్రహాల ప్రయోగానికీ.. సేబర్ ఇంజిన్‌తో కూడిన విమానాలు ప్రయాణికుల కోసమే కాకుండా.. ఉపగ్రహ ప్రయోగాలకూ వాడుకోవచ్చని ‘రియాక్షన్’కు చెందిన షాన్ డ్రిస్కాల్ చెబుతున్నారు. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడం.. నేరుగా అంతరిక్షంలోకి వెళ్లి.. ఉపగ్రహాన్ని విడుదల చేసి వెనక్కు వచ్చేయొచ్చని వివరించారు. సేబర్ ఇంజిన్ అభివృద్ధి కోసం యూకే ప్రభుత్వం ఇప్పటికే సుమారు 6 కోట్ల పౌండ్ల నిధులు అందించిందని, బోయింగ్, రోల్స్ రాయిస్, బీఏఈ సిస్టమ్స్ వంటి ప్రైవేట్ కంపెనీలూ పెట్టుబడులు పెట్టాయని షాన్ తెలిపారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌పోర్ట్ కార్న్‌వాల్ నుంచి ఈ సేబర్ ఇంజిన్ ఆధారిత విమానాలు టేకాఫ్ తీసుకోవచ్చునని అంచనా. 2021లో ఈ హైటెక్ విమానాశ్రయం సిద్ధం కానుండగా.. సేబర్ విమానాలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో పదేళ్లు పట్టే అవకాశముంది. సేబర్ ఇంజిన్ల ప్రత్యేకత? విమానం వేగం పెరిగే కొద్దీ ఇం జిన్ వేడెక్కిపోతూ ఉంటుంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు ఇంజిన్ లోపలి భాగాలు కరిగిపోయేంత వేడి పుడుతుంది. ఈ సమస్యను రియా క్షన్ శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. ద్రవ హీలియంను వాడటం ద్వారా ఇంజిన్లోకి వచ్చే గాలి వేడిని 1,000 డిగ్రీల సెల్సియస్ నుంచి –150 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిం చగలిగారు. గాల్లోని తేమ మంచు ముక్కలుగా మారకుండా సెకనులో వం దో వంతులోనే చల్లబరచడం విశేషం. కొన్ని రోజులు మాత్రమే పనిచేసి మళ్లీ మూలనపడ్డ కాన్క్రోడ్ విమాన సర్వీసు గుర్తుందా? అది కూడా వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేదే. ఇంజిన్ వేడిని తగ్గించేందుకు నేరుగా గాలిని వాడే వారు. సేబర్ ఇంజిన్లలో హైడ్రోజన్‌ను కూడా ఇంధనంగా వాడవచ్చు. ఫలితం గా విమానం ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. ప్రస్తుత విమానాలను సేబర్ ఇంజిన్లతో నడపవచ్చని, అవి కాన్క్రోడ్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని యూకే స్పేస్ ఏజెన్సీకి చెందిన గ్రాహం టర్నాక్ అంటున్నారు. సాధారణ విమానాలు 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరితే కొత్త రకం ఇంజిన్ల విమానాలు 92 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. -
హాక్ జెట్ తొలి మహిళా పైలట్ మోహనా
నాగ్‌పూర్: ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ అరుదైన ఘనత సాధించారు. అత్యాధునిక హాక్ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో మోహనాసింగ్ శిక్షణను పూర్తిచేసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది. శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని పూర్తిచేశారు. ఆమెకు 500 గంటలకుపైగా ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఇందులో 380 గంటలు హాక్ ఎంకే–132 జెట్‌ను నడిపారు. -
జెట్ నుంచి ఎజెక్ట్ అయితే.. ఎట్లుంటదో తెలుసా ?
అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు జెట్ విమానాల నుంచి దూకాల్సి వస్తుంది. అలా దూకడం అంత సులువేం కాదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలా దూకిన తర్వాత గాయాలపాలైన పైలట్లు కొన్ని సంవత్సరాల వరకు ఏ విమానాన్ని కూడా నడపలేరు. విమానం నుంచి సడన్‌గా సీటు విడిపోవడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. దూకే సమయంలో సాధారణ గురుత్వాకర్షణ శక్తి కన్నా 14 నుంచి 16 రెట్లు ఎక్కువగా సీటుపై శక్తి పనిచేస్తుంది. గాలి వేగంగా ఉన్న సమయంలో జెట్ నుంచి దూకడం వల్ల చేతులు విరుగుతుంటాయి. భుజం ఎముకకు గాయాలు అవుతుంటాయి. కాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే అవకాశ ఉంటుంది. మంటలు రావడంతో శరీరం కాలిపోయే ప్రమాదం ఉంది. -
నింగి నుంచి మిరాజ్ మెరుపులు.. నేల కరిచి పాక్ అరుపులు
-
పాక్ ఆర్మీ తేరుకునేలోపే పనిపూర్తి...
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ఘటనతో రగిలిపోతున్న భారత్ వైమానిక దళం... పాకిస్తాన్ ఆర్మీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ తేరుకునేలోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే వెనుతిరిగాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 జెట్ ఫైటర్లు...ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులను వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించగా, జైషే మహ్మద్‌కు చెందిన అల్పా-3 కంట్రోల్ రూం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. (పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) కీలకపాత్ర పోషించిన మిరాజ్ యుద్ధ విమానం... ఈ దాడుల్లో మిరాజ్ 2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది. మొత్తం 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. అధునాతర మల్టీరోల్ ఫైటర్ అయిన ఈ యుద్ధ విమానం గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. న్యూక్లియర్ దాడుల కోసం ఈ యుద్ధ విమానాన్ని ప్రత్యేకంగా రూపొందించబడింది. 1550 కిలోమీటర్ల లక్ష్యాన్ని మిరాజ్ అవలీలగా ఛేదించగలదు. సెకన్‌కు 280 మైల్స్ ఎగిరే సామర్థ్యం ఉండగా, 2X30 కెనాన్లతో 125 రౌండ్లు దాడి చేయగలదు. (సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!) తొలి దాడి : బాలాకోట్‌లో 3.45 గంటలకు రెండో దాడి : ముజఫరాబాద్‌లో 3.48 గంటలకు మూడో దాడి : చకౌటిలో 3.58 గంటలకు 21 నిమిషాల వ్యవధిలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన వైమానిక దళం -
నిట్ట నిలువునా సముద్రంలోకి..!
-
నిట్ట నిలువునా సముద్రంలోకి..!
రోమ్ : ఇటలీ సైన్యం జరుపుతున్న విన్యాసాల్లో అపశృతి దొర్లింది. మూడు రోజులగా పాటు ఇటలీ సైన్యం టెర్రాన్సియా సముద్ర తీరం వెంబడి వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో భాగంగా జెట్ ఫ్లయిట్‌ను నడుపుతున్న పైలెట్లు.. నిటారుగా నింగిని ఎగిరి... అంతే వేగంగా సముద్రపు ఉపరితలం మీదకు వచ్చి.. వెంటనే పైకి లేవాలి. ఈ విన్యాసాన్ని చేస్తున్న సమయంలో.. జెట్ ఫ్లయిట్ అదుపు తప్పి నేరుగా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ అక్కడిక్కడే మృతిచెందారు. -
హైవే మీద యుద్ధ విమానాల హడావుడి
ఎక్కడైనా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించాలంటే రిబ్బన్ కట్ చేస్తారు. కానీ, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం మాత్రం ధూమ్ ధామ్‌గా జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. భారతీయ వైమానిక దళానికి చెందిన ఆరు జెట్ విమానాలు ఆ ఎక్స్‌ప్రెస్ వే మీద ల్యాండ్ అయ్యాయి. ఆ రహదారిని సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రారంభించారు. మొత్తం 302 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 3.3 కిలోమీటర్ల రోడ్డును అత్యవసర సమయాల్లో జెట్ విమానాల ల్యాండింగ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు. విమానాలు ఒకదాని వెంట ఒకటి వచ్చి రోడ్డు మీద దిగుతుంటే.. వేలాది మంది గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే.. విమానాలు దాదాపు దిగినంత పని చేశాయి గానీ, వాటి చక్రాలు మాత్రం రోడ్డుమీద ఆనుకోలేదని, అలా ఆనుకుంటే చక్రాలు పాడవుతాయని వైమానిక దళం అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే మీదుగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ జెట్ విమానాలు వెళ్లాయి. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మొత్తం రూ. 13,200 కోట్ల ఖర్చయింది. కేవలం 22 నెలల్లోనే 302 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశారు. వచ్చే సంవత్సరం నుంచి దీనిమీదకు వాహనాలను అనుమతిస్తారు. ఇది దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అవుతుంది. ప్రస్తుతం ఆరు లేన్లే అయినా, అవసరాన్ని బట్టి 8 లేన్లకు కూడా విస్తరించుకోవచ్చు. లక్నో నుంచి ఢిల్లీకి రోడ్డుమార్గంలో వెళ్లాలంటే ప్రస్తుతం 11 గంటలు పడుతుండగా, ఈ ఎక్స్‌ప్రెస్ వే వచ్చిన తర్వాత అది సరిగ్గా సగం.. అంటే ఐదున్నర గంటలకు తగ్గిపోతుంది. లక్నో నుంచి ఉన్నవ్, కనౌజ్, ఇటావా, మైన్‌పురి, ఫిరోజాబాద్ మీదుగా ఇది ఆగ్రా చేరుకుంటుంది.