
మోహనా సింగ్
నాగ్‌పూర్: ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ అరుదైన ఘనత సాధించారు. అత్యాధునిక హాక్ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో మోహనాసింగ్ శిక్షణను పూర్తిచేసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది. శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని పూర్తిచేశారు. ఆమెకు 500 గంటలకుపైగా ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఇందులో 380 గంటలు హాక్ ఎంకే–132 జెట్‌ను నడిపారు.