Kalaikunda base
-
హాక్ జెట్ తొలి మహిళా పైలట్ మోహనా
నాగ్‌పూర్: ఫ్లైట్ లెఫ్టినెంట్ మోహనా సింగ్ అరుదైన ఘనత సాధించారు. అత్యాధునిక హాక్ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో మోహనాసింగ్ శిక్షణను పూర్తిచేసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది. శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని పూర్తిచేశారు. ఆమెకు 500 గంటలకుపైగా ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఇందులో 380 గంటలు హాక్ ఎంకే–132 జెట్‌ను నడిపారు. -
కూలిన వాయుసేన హెలికాప్టర్
సాక్షి, భువనేశ్వర్ : ఒడిశా-జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ ణష్టం జరగలేదు. పైలట్‌తో పాటు మరొకరు గాయపడ్డగా...వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుందా వైమానిక స్థావరం నుంచి రోజు మాదిరిగానే శిక్షణ కోసం బయలుదేరిన విమానం వెనుక భాగం నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు సమాచారం. కాగాప్రమాదానికి కారణం ఏమిటన్నదానిపై స్పష్టత రాలేదని, విచారణ చేపడుతన్నామని అధికారులు తెలిపారు. -
కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్ విమానం
కోల్‌కతా: గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ విమానం ఏఎన్-32 విమానం ఆచూకీ ఇంకా తెలియకముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన హాక్ అడ్వాన్సెడ్డ్ ట్రైనర్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ గురువారం ప్రమాదానికి గురైంది. పశ్చిమ బెంగాల్ లోని కలైకుందాలో కుప్పకూలింది. విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. కాగా, 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు ఈ నెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానం ఏఎన్-32తో గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి ఈ సంఘటన జరిగి 14 రోజులైపోయాయి. అయినా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.