కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్ విమానం | IAF Hawk Advanced Trainer Jet aircraft crashes at Kalaikunda | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్ విమానం

Published Thu, Aug 4 2016 2:16 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్ విమానం

కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్ విమానం

కోల్కతా: గల్లంతైన ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏఎన్‌-32 విమానం ఆచూకీ ఇంకా తెలియకముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన హాక్ అడ్వాన్సెడ్డ్ ట్రైనర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ గురువారం ప్రమాదానికి గురైంది. పశ్చిమ బెంగాల్ లోని కలైకుందాలో కుప్పకూలింది. విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.

కాగా, 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు ఈ నెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానం ఏఎన్‌-32తో గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి ఈ సంఘటన జరిగి 14 రోజులైపోయాయి. అయినా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement