సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌జెట్ ఒకటి కలకలం సృష్టించింది. కాగా, చేపలవేటకు వెళ్లిన మత్య్సకారులకు నీటిపై తేలియాడుతూ డ్రోన్ జెట్ కనిపించింది. దీంతో, వారు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు దీన్ని ఎవరు ప్రయోగించారు?, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, దానిపై ఉన్న అక్షరాలను బట్టి పోలీసులు కోడ్ చేస్తున్నారు. అయితే, ఇది విదేశాలకు చెందినదా?.. లేక స్వదేశంలో తయారైందా? అనే కోణంలో కూడా ఢిల్లీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
మరోవైపు, వాతావరణ శాఖకు చెందిన, అంతరిక్ష పరిశోధనాల్లో ఇలాంటి డ్రోన్ జెట్లను శాస్త్రవేత్తలు వాడుతుంటారని సమాచారం. ఇక, దీన్ని ఎవరి ప్రయోగించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రోన్‌పై ఈస్ట్ కోస్ట్ నావల్ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని ఎలాంటి కెమెరాలు లేవు. కానీ.. రేడియో సిగ్నల్స్‌ను పంపే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రం ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment