
రోమ్ : ఇటలీ సైన్యం జరుపుతున్న విన్యాసాల్లో అపశృతి దొర్లింది. మూడు రోజులగా పాటు ఇటలీ సైన్యం టెర్రాన్‌సియా సముద్ర తీరం వెంబడి వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో భాగంగా జెట్ ఫ్లయిట్‌ను నడుపుతున్న పైలెట్లు.. నిటారుగా నింగిని ఎగిరి... అంతే వేగంగా సముద్రపు ఉపరితలం మీదకు వచ్చి.. వెంటనే పైకి లేవాలి. ఈ విన్యాసాన్ని చేస్తున్న సమయంలో.. జెట్ ఫ్లయిట్ అదుపు తప్పి నేరుగా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ అక్కడిక్కడే మృతిచెందారు.

