
అబుదాబిలో జోయాలుక్కాస్ షోరూమ్
జోయాలుక్కాస్ తాజాగా అబుదాబి లోని ముష్రిఫ్ మాల్‌లో కొత్తగా షోరూమ్‌ను ప్రారంభించింది. ఇందులో బంగారం, డైమండ్, విలువైన రాళ్లు, ప్లాటినం, రత్నాలు సంబంధిత ఆభరణాలు పలు రకాల మోడళ్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఆభరణాల కొనుగోలుపై బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తున్నట్లు జోయలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ తెలిపారు. జోయాలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్, జోయాలుక్కాస్ గ్రూప్ డెరైక్టర్లు ఆంటోనీ జోస్, మేరీ ఆంటోనీ సహా ఇతర ప్రముఖుల సమక్షంలో ఇతిహద్ గెస్ట్ మేనేజింగ్ డెరైక్టర్ యాసర్ అల్ యూసుఫ్ షోరూమ్‌ను ప్రారంభించారు.