సిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలో గల ట్రాక్టర్ షోరూంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు ట్రాక్టర్లు కాలినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. మంటలు అంటుకున్నాయన్న సమాచారం రాగానే వెంటనే అప్రమత్తమై ఘటన స్థలానికి చేరుకున్నామని జిల్లా ఫైర్ ఆఫీసర్ సతీష్‌రావు తెలిపారు. ఐచర్ ట్రాక్టర్ షోరూంలో రోజువారీ మాదిరిగా షాపును మూసివేసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. మంటలు అంటుకున్న సమయంలో అక్కడున్న కొందరు షోరూంలోని కొన్ని ట్రాక్టర్స్ బయటకు తీశారని, వారికి వెంటనే ఫైర్ సిబ్బంది తోడవ్వగా షోరూమ్‌లో ఉన్న 13 ట్రాక్టర్స్‌లో 10 ట్రాక్టర్స్ బయటకు తీశారని తెలిపారు. (కోడలి క్యారెక్టర్‌పై అనుమానం.. స్నేహితులతో కలిసి)
మూడు ట్రాక్టర్స్ కాలిపోగా, రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు జిల్లా ఫైర్ ఆఫీసర్ పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు లేదని, ఏదేని ట్రాక్టర్ ఇంజిన్ నుంచి జరిగిన ప్రమాదమా లేక, ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ట్రాక్టర్స్‌లోని వివిధ కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని, ఎవరైనా నిప్పు పెట్టినట్లు తనకు అనుమానం లేదని షో రూం నిర్వాహకుడు నాగిరెడ్డి సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో దాదాపు రూ.9 లక్షల పైగా ఆస్తినష్టం జరిగిందని షోరూం నిర్వాహకుడు తెలిపారు. (అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు! )
Comments
Please login to add a commentAdd a comment