ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 ‘సెల్‌ పాయింట్‌’ షోరూంలు | Another 30 'cell point' show in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 ‘సెల్‌ పాయింట్‌’ షోరూంలు

Published Thu, Mar 15 2018 12:49 AM | Last Updated on Thu, Mar 15 2018 12:49 AM

Another 30 'cell point' show in Andhra Pradesh - Sakshi

కర్నూలు (టౌన్‌): ‘‘ గ్యారంటీ లేని సెల్‌ఫోన్‌లు అమ్ముతున్న తరుణంలో  సెల్‌ఫోన్‌ విక్రయాల్లోకి వచ్చా. 2001 సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా  విశాఖపట్నంలో సెల్‌ పాయింట్‌ ప్రారంభించా. కస్టమర్లు ఆదరించారు. ఇక వెనుతిరిగి చూడలేదు...’’ అని ప్రముఖ మొబైల్‌ విక్రయ సంస్థ సెల్‌పాయింట్‌ షోరూమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మోహన్‌ ప్రసాద్‌ పాండే అన్నారు. కర్నూలులో బుధవారం మూడు షోరూంలు ప్రారంభ సందర్భంగా ఆయన ‘సాక్షితో’ మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
 
రాష్ట్రంలో 85 షోరూంలు..  సీమలో మరో 30... 
సెల్‌ఫోన్‌ల ప్రాధాన్యం పెరిగింది. అంతే నాణ్యతతో సెల్‌ఫోన్లు విక్రయిస్తున్నాం. అన్ని వర్గాలు మా వద్ద కోనుగోలు చేసే విధంగా నమ్మకం కలిగించాం. గ్యారంటీ విక్రయాలతో మంచి ఆదరణ వచ్చింది. సెల్‌ఫోన్‌ విక్రయాలతో పాటు యాక్ససరీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫోన్‌ కవర్‌తో పాటు మెమరీ కార్డులు, పౌచెస్, ప్రొటెక్షన్‌  స్క్రీన్‌గార్డు, హెడ్‌సెట్‌ ఇలా... అన్ని రకాల కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్లు ఉన్నాయి.  విలువైన ఫోన్లకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. అమ్మకాలకే పరిమితం కాకుండా అమ్మకం తరువాతి సర్వీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. విశాఖపట్నంతో పాటు విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు... ఇలా అన్ని జిల్లాలో మా షోరూంలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కర్నూలులో ఒకేరోజు 3 షోరూంలు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 85 షోరూంలు ఉన్నాయి.  త్వరలోనే సీమ జిల్లాలో మరో 30 షోరూంలు ప్రారంభిస్తాం. 

కర్నూలులో శిక్షణ కేంద్రం 
ఇప్పుడున్న సెల్‌ ఫోన్‌ షోరూంలతో పాటు మరో 30 షోరూంలు రావడం వల్ల ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అందువల్లే కర్నూలు నగరంలోనూ కంపెనీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడే 200 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి కంపెనీ  షోరూమ్‌లలో నియమిస్తాం. మా సంస్థలో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement