దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం | Man Caught Firing Outside Showroom Captured On CCTV | Sakshi
Sakshi News home page

దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం

Published Sun, Oct 9 2022 2:50 PM | Last Updated on Sun, Oct 9 2022 2:54 PM

Man Caught Firing Outside Showroom Captured On CCTV - Sakshi

న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి  కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్‌ బైక్‌ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి  దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసినట్ల తెలిపారు.

షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: నకిలీ వెబ్‌సైట్‌లతో చీటింగ్‌... 12 మంది అరెస్టు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement