పీకల దాకా మద్యం.. ఇద్దరి ప్రాణాలు తీశాడు | E-Rickshaw Driver And Woman Lost Life By Speeding Car In Delhi | Sakshi
Sakshi News home page

పీకల దాకా మద్యం.. ఇద్దరి ప్రాణాలు తీశాడు

Published Wed, Jun 16 2021 11:44 AM | Last Updated on Wed, Jun 16 2021 11:45 AM

E-Rickshaw Driver And Woman Lost Life By Speeding Car In Delhi - Sakshi

ఢిల్లీ: డ్రైవరు పీకలదాకా మద్యం తాగి కారు నడపడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని డిలైట్ సినిమా హాలు వద్ద డ్రైవరు మద్యం తాగి కారును వేగంగా నడుపుతూ ఓ కుటుంబం ప్రయాణిస్తున్న ఈ-రిక్షాను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఈ-రిక్షా డ్రైవర్‌తోపాటు ఓ మహిళ మరణించారు. ప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో ఆలస్యంగా వెలుగుచూసింది.

ఈ-రిక్షాలో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు పారిపోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. మద్యం తాగి కారును వేగంగా నడపటం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.


చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం; 10 మంది మృతి

వీడియో వైరల్‌: వేలు చూపిస్తూ వార్నింగ్‌, అంతలోనే తుపాకీతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement