న్యూఢిల్లీ: వ్యాపారవేత్తకు వలపు విసిరి బ్లాక్‌మెయిల్ చేసింది ఓ జంట. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించి రూ.80లక్షలు వసూలు చేసింది. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఆ జంటపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
వివారాల్లోకి వెలితే.. గురుగ్రాం బాద్‌షాపుర్‌కు చెందిన వ్యాపారవేత్త ఓ అడ్వర్‌టైస్‌మెంట్ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఢిల్లీ షాలిమర్ బాగ్‌కు చెందిన నామ్రా ఖాదిర్ అనే మహిళను బిజినెస్ విషయాలు మాట్లాడేందుకు కొద్ది నెలల క్రితం ఓ హోటల్‌లో కలిశాడు. ఆమెతో పాటు విరాట్ అలియాస్ మనీశ్ బనీవాల్ కూడా ఉన్నాడు.
పెళ్లి చేసుకుంటానని..
తన వ్యాపార పనుల కోసం నామ్రా ఖాదిర్‌కు రూ.2.50లక్షలు ఇచ్చాడు బాధితుడు. అయితే డబ్బు తీసుకున్నప్పటికీ ఆమె దానికి తగినట్లు పనిచేయలేదు. దీంతో ఆమెను అతడు ప్రశ్నించాడు. ఆ సమయంలోనే ఆమె అతడ్ని ఇష్టపడ్డానని, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ క్లోజ్ అయ్యారు.
పెళ్లి ప్రపోజల్ తర్వాత నమ్రా ఖాదిర్‌తో వ్యాపారవేత్త చాలా రోజలు కలిసితిరిగాడు. ఇద్దరూ పలుమార్లు హోటల్‌లో గడిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు విరాట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత వాటిని లీక్ చేస్తామని, రేప్ కేసు పెడతామని బెదిరించి వ్యాపారవేత్త నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తం రూ.80లక్షలు కాజేశారు. అయినా ఇంకా బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఇక చివరకు పోలీస్ స్టేషన్ వెళ్లాడు ఆ బిజినెస్‌మేన్. ఖాదిర్, విరాట్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్టోబర్ 10న ఈ జంటకు నోటీసులు పంపారు. అయితే వాళ్లు బెయిల్ కోసం గురుగ్రామ్ కోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం నవంబర్ 18న వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో వాళ్లిద్దరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ జంటను అదుపులోకి తీసుకుంటామన్నారు.
చదవండి: ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి..
Comments
Please login to add a commentAdd a comment