ముంబై: అతనో ఐటీ ఇంజినీర్. వయసు 28 ఏళ్లు. తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఓ మేట్రీమోని ద్వారా అమ్మాయి దొరికింది. ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయి. దీంతో ఇరుకుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి. జులైలో అమ్మాయి పుట్టినరోజున ఇంటికి వెళ్లి సెలబ్రేట్ చేశారు అబ్బాయి కుటుంబసభ్యులు. ఎంగేజ్‌మెంట్ కోసం అబ్బాయి ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాడు. పెళ్లి కోసం సూరత్ వెళ్లి నగలు కొనుగోలు చేశారు. అక్టోబర్‌లో వివాహం చేసుకోవాలనుకున్నారు.
అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అమ్మాయి తరచూ ఫోన్‌లో మాట్లాడటం గమనించాడు అబ్బాయి. ఎవరు అని అడిగితే.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. క్యాజువల్‌గా మాట్లాడుతుందేమో అనుకుని పట్టించుకోలేదు.
అయితే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను బయట కలవడం చూశాడు అబ్బాయి. అతను ఇచ్చే గిఫ్ట్‌లు కూడా ఆమె తీసుకోవడం గమనించాడు. ఓ రోజు ఇద్దరూ రోడ్డుపై హగ్ చేసుకోవడం చూసి షాక్ అయ్యాడు. ఇక లాభం లేదని తెలిసి పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఈ పెళ్లి వద్దని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడు.
అబ్బాయి పెళ్లి వద్దన్నాడని తెలిసి అమ్మాయి అతడ్ని ఒప్పించేందుకు ప్రత్నించింది. కానీ అతను మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అమ్మాయి బెదిరించింది. విషం తీసుకుంటానని చెప్పి వీడియో కాల్‌లో ఓ పౌడర్‌ను కూడా చూపించింది. కానీ అబ్బాయి మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.
దీంతో తల్లిదండ్రులతో కలిసి అమ్మాయి అతడ్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. పెళ్లి రద్దు చేసుకున్నందుకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది.
ఏం చేయాలో తెలియక అబ్బాయి పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం వాళ్లకు వివరించాడు. దీంతో వారు అమ్మాయి, ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముంబైలోని చార్‌కోప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
చదవండి: భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment