![HYD: Son In Law blackmail Mother In Law With Secret Photos - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/blackmail.jpg.webp?itok=MYQ_eipa)
సాక్షి, బంజారాహిల్స్: అత్తింటి వాళ్లు తన ప్రమేయం లేకుండా భార్యను తీసుకెళ్లారనే కోపంతో అత్తతో గొడవపడి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డ అల్లుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్‌నగర్‌లో నివసించే మహ్మద్ అక్రం పాషా పాన్‌షాప్ నిర్వహిస్తుంటాడు. కార్మికనగర్‌కు చెందిన యువతితో ఏడు నెలల క్రితం పెళ్లైంది. భార్య గర్భిణి కావడంతో రెండు రోజుల క్రితం అతడి మామ వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. అయితే తన ప్రమేయం లేకుండానే భార్యను తీసుకెళ్లాడనే కోపంతో అక్రంపాష ఆగ్రహంతో అత్తతో గొడవపడ్డాడు.
తన భార్యను పంపించకపోతే అంతు చూస్తానని, మీ అశ్లీల ఫొటోలు నెట్‌లో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడు. నెట్లో నుంచి ఒక అశ్లీల ఫొటో అత్తకు వాట్సాప్ చేసి ఇదే మాదిరిగా మీ ఫొటోలను ఎడిట్ చేసి నెట్లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో అత్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ 506, 509, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment