blackmale
-
అత్తతో తగాదా.. అశ్లీల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్
సాక్షి, బంజారాహిల్స్: అత్తింటి వాళ్లు తన ప్రమేయం లేకుండా భార్యను తీసుకెళ్లారనే కోపంతో అత్తతో గొడవపడి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డ అల్లుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్‌నగర్‌లో నివసించే మహ్మద్ అక్రం పాషా పాన్‌షాప్ నిర్వహిస్తుంటాడు. కార్మికనగర్‌కు చెందిన యువతితో ఏడు నెలల క్రితం పెళ్లైంది. భార్య గర్భిణి కావడంతో రెండు రోజుల క్రితం అతడి మామ వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. అయితే తన ప్రమేయం లేకుండానే భార్యను తీసుకెళ్లాడనే కోపంతో అక్రంపాష ఆగ్రహంతో అత్తతో గొడవపడ్డాడు. తన భార్యను పంపించకపోతే అంతు చూస్తానని, మీ అశ్లీల ఫొటోలు నెట్లో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడు. నెట్లో నుంచి ఒక అశ్లీల ఫొటో అత్తకు వాట్సాప్ చేసి ఇదే మాదిరిగా మీ ఫొటోలను ఎడిట్ చేసి నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో అత్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ 506, 509, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు -
21 ఏళ్ల యువతికి ఆరో తరగతి బాలుడి వేధింపులు
లక్నో: పిదప కాలం.. పిదప బుద్ధులు అంటే ఇవే. ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే.. ఏమనుకోవాలి. యువతి మార్ఫ్డ్ చిత్రాలను ఉపయోగించి డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్ చాట్ చేయాలంటూ వేధింపులుకు గురి చేస్తున్నాడో పిల్లాడు. ఆ వివరాలు.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, సదరు పిల్లాడు విద్యార్థులు క్రియేట్ చేసిన ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్‌లో అన్ని వయసులు విద్యార్థులు ఉంటారు. జూనియర్లకు, సీనియర్ విద్యార్థులు అనుమానాలు నివృత్తి చేస్తూ.. బాగా చదువుకునేందుకు సాయం చేస్తూంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ పూర్తి చేసి.. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో మెంబర్.(ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం) అలా ఇద్దరికి పరిచయం. తొలుత పిల్లాడు, బాధిత యువతితో చదువుకు సంబంధించిన విషయాలు చర్చించేవాడు. అలా కొద్ది రోజుల పాటు చదువు గురించి మాట్లాడి మంచి వాడిగా నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం 3.30గంటలకు సదరు పిల్లాడు, యువతి మొబైల్‌కు ఆమె మార్ఫ్డ్ చిత్రాలు పంపించాడు. ఇవి చూసి సదరు యువతి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది. అంత చిన్న పిల్లాడు ఇలాంటి పాడు పనులు చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ మెసేజ్ గురించి ఆలోచిస్తుండగానే ఆ పిల్లాడు ఫోన్ చేసి.. ఆమె సోషల్ మీడియా అకౌంట్నుంచి ఫోటోలను తీసుకున్నాని.. తాను అడిగినంత డబ్బైనా ఇవ్వాలి.. లేదా తనతో సెక్స్ చాట్ చేయాలన్నాడు. లేదంటే యువతి మార్ఫ్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాక ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశానని చెప్పాడు. దాంతో భయపడిన యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. అనంతరం ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు సదరు పిల్లాడిని పిలిపించి మాట్లాడారు. కానీ వాడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.(ఆ హీరోయిన్‌కు సైబర్ షాక్) పిల్లాడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. మెసేజ్‌ల గురించి తనకు ఏం తెలియదని.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు సోషల్ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరారు. సైబర్ టీం ఐపీ అడ్రెస్‌ను ట్రేస్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో పోలీసులు చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవద్దని.. ఇచ్చినా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. -
ఇదేనా ‘సభ్యత’?
= టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్, పింఛన్ = తారాస్థాయికి అధికార పార్టీ ఆగడాలు = కార్డుదారులను ముప్పుతిప్పలు పెడుతున్న ‘పచ్చ’ డీలర్లు = రూ.వంద కట్టించుకుని బలవంతంగా సభ్యత్వం ఇస్తున్న వైనం ధర్మవరం : అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదులోనూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఇష్టమున్నా, లేకున్నా బలవంతంగా సభ్యత్వ రశీదును అంటగడుతున్నారు. రూ.వంద చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పింఛన్‌దారులు, రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే ‘కోత’ పెడతామంటూ బెదిరిస్తున్నారు. దీనివల్ల బాధితులు లబోదిబోమంటున్నారు. అధికార టీడీపీ నాయకులు ప్రతియేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. అయితే.. ఈ సారి తమ అధినేత వద్ద మార్కులు కొట్టేయాలని భావించిన ధర్మవరం నియోజకవర్గ నాయకులు ఓ అడుగు ముందుకేసి తమ పార్టీ కేడర్‌కు, అనుయాయులకు టార్గెట్లు పెట్టారు. స్టోర్ డీలర్లు, పింఛన్ పంపిణీదారులు, ఉపాధి మేట్లకు కూడా టార్గెట్లను నిర్దేశించారు. వారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ టీడీపీ సభ్యులుగా చేరాలంటే ఒత్తిడి చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 72,490 రేష¯ŒSకార్డులు ఉన్నాయి. 41,819 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మందికి టీడీపీ సభ్యత్వం అంటగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేషన్ డీలర్లు తమ వద్దకు సరుకుల కోసం వచ్చే వారిని తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు. సభ్యత్వం కోసం రూ.వంద కట్టి సరుకులు తీసుకెళ్లండని, లేకపోతే ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెల సరుకులను అరువుపై ఇవ్వాలని డీలర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. డీలర్లు మాత్రం తప్పనిసరిగా రూ.వంద చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఈ నెల నుంచి «పింఛన్ దారులకు ఇబ్బందులు తలెత్తకూడదని నేరుగా అకౌంట్లకు పింఛన్ మొత్తాలను జమ చేశారు. వారిలో చాలా మందికి అకౌంట్లు లేకపోవడం, ఉన్నా ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకున్న అధికార పార్టీ నాయకులు పింఛన్ రావాలంటే తప్పనిసరిగా రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని వృద్ధులు, వికలాంగులను భయపెడుతున్నారు. ఒకవైపు రేషన్.. మరోవైపు సభ్యత్వ నమోదు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన సిబ్బంది రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద కూర్చుని, కార్డుదారుల వివరాలు అక్కడికక్కడే సేకరించి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. రూ.100 కట్టించుకుని వారికి రశీదులు ఇచ్చిపంపుతున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్సు ఉంటుందని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుందని మభ్యపెడుతున్నారు. దీనిపై ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్‌ను సంప్రదించగా..ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఎస్ఐ నుంచి రక్షణ కల్పించాలి బాధితుడి వేడుకోలు
జగ్గయ్యపేట అర్బన్ : అన్నదమ్ముల వివాదంలో ఎస్ఐ పి.శ్రీను బెదిరింపులకు పాల్పడుతున్నడని పట్టణానికి చెందిన అప్పారి వెంకటేశ్వరరావు ఆరోపించాడు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నదమ్ముల ఘర్షణ విషయంలో పట్టణ ఎస్ఐ తనను విచక్షణ రహితంగా దాడి చేయగా న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. జడ్జి ఆదేశం మేరకు ఎస్ఐ పి.శ్రీనుపై కేసు నమోదు అయినట్లు చెప్పారు. ఆ కేసును పోలీసులంతా కలిసి నీరుగార్చారని పేర్కొన్నాడు. ఎస్ఐపై కేసు నమోదైనప్పటి నుంచి ఎస్ఐతో పాటు ఆయన మద్దతుదారులు అనేకసార్లు వచ్చి రాజీపడాలని, లేకపోతే చంపుతామని, సంతకాలు చేయాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. ఈ నెల 2 వ తేదీ తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట సమీపంలోని పరివిరి గ్రామంలో ఉన్న మా అమ్మ సూర్యకాంతం(72) వద్దకు కానిస్టేబుల్ దాసు వెళ్లి ఎస్ఐ పంపాడు సంతకాలు పెట్టాలని బెదిరించినట్లు తెలిపాడు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.