
ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర: మంగళూరు ఉళ్లాలలో హనీట్రాప్ వెలుగుచూసింది. ఇక్కడి అపార్టుమెంటులో సప్నా, అఫ్రీన్ అనే యువతులు తమ పక్క ఫ్లాట్‌లో ఉండే వ్యాపారవేత్తను ఈ నెల 19న రాత్రి భోజనానికి పిలిచారు. అంతకుముందు అతనితో పథకం ప్రకారం పరిచయం పెంచుకున్నారు. అతడు విందుకు రాగానే మద్యం తాగించి రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతనితో అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను సప్నా తీసుకుంది. మరుసటి రోజు తేరుకున్న వ్యాపారవేత్త తన డబ్బు, నగలను ఇవ్వాలని కోరగా, అశ్లీల వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో అతడు ఈనెల 23న ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరు యువతులనూ అరెస్ట్ చేశారు.