గన్‌ చూయించి రూ.70 లక్షలు దోచుకెళ్లారు | Delhi Businessman Robbed Of Rs 70 Lakh At Gunpoint On Busy Flyover | Sakshi
Sakshi News home page

గన్‌ చూయించి రూ.70 లక్షలు దోచుకెళ్లారు

Published Sat, Aug 4 2018 9:03 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Delhi Businessman Robbed Of Rs 70 Lakh At Gunpoint On Busy Flyover - Sakshi

వ్యాపారిని గన్‌తో బెదిరిస్తోన్న దుండగుడు

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో రద్దీగా ఉండే ఓ ప్లైఓవర్‌పై గురువారం దోపిడీ జరిగింది. ఈ దోపిడీకి సంబంధించి ఓ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. కాశీష్‌ బన్సాల్‌ అనే వ్యక్తి తన ఇంటి నుంచి గుర్‌గావ్‌కు కారులో వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఢిల్లీ నరైనా ప్రాంతంలోని ఓ ప్లైఓవర్‌పై అడ్డగించారు. తుపాకీ చూయించి కారు డిక్కీలో ఉన్న రూ.70 లక్షలు ఎత్తుకెళ్లారు.

అయితే ఈ తతంగాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేశాడు. అనంతరం పోలీసులకు వీడియోను చూయించాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు, వ్యాపారికి బాగా తెలిసిన వాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement