ఏకే 47 తో కాల్చి చంపేస్తాం.. | school British School threat call: Delhi police has now cleared the area after one hour lockdown and tracing the call | Sakshi
Sakshi News home page

ఏకే 47 తో కాల్చి చంపేస్తాం..

Published Thu, Feb 4 2016 5:51 PM | Last Updated on Tue, Jun 4 2019 6:41 PM

ఏకే 47 తో కాల్చి చంపేస్తాం.. - Sakshi

ఏకే 47 తో కాల్చి చంపేస్తాం..

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలోని  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ స్కూలులో అందరినీ చంపేస్తానంటూ ఓ ఆగంతకుడు హెచ్చరించడం కలకలం రేపింది.  దీంతో యాజమాన్యం, విద్యార్థులు గజగజ వణికిపోయారు.  గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుండగుడు ఫోన్ చేశాడు.

ఏకే 47 తుపాకితో అందర్నీ కాల్చి చంపేస్తానంటూ ఫోన్ లో బెదిరించాడు.  కంగారుపడిన స్కూలు యాజమాన్యం  పోలీసులకు  సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.  అయితే అది ఫేక్ కాల్ అని పోలీసులు తర్వాత తేల్చారు. అయితే ఆ  కాల్ ఎక్కడనుంచి వచ్చిందీ, ఎవరు చేశారు అనే వ ఇషయాలను ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement