దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉత్తమ అమ్మకాలు పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎట్టకేలకు తన 500వ షోరూమ్ ప్రారంభించింది. ప్రారంభంలో ఒక్క షోరూమ్ కూడా లేకుండా మొదలైన ఓలా ఇప్పుడు భారీ స్థాయిలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ & షోరూమ్‌లను ప్రారంభించడంలో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ షోరూమ్ ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన 500వ షోరూమ్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో ఓలా షోరూమ్ ఉన్నట్లు సమాచారం. అయితే 2023 ఆగష్టు నాటికి దేశంలో ఈ షోరూమ్‌ల సంఖ్య 1000కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను, షోరూమ్‌లను పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం ఎక్కువ భాగం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ల ద్వారా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. అయితే కంపెనీకి చెందిన షోరూమ్‌లు వాహనాలను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా టెస్ట్ రైడ్ వంటి సదుపాయాలను అందించడానికి ఉపయోగపడుతున్నాయి.
(ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!)
ఓలా 500వ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సిఎమ్ఓ 'అన్షుల్ ఖండేల్వాల్' మాట్లాడుతూ.. ప్రస్తుతం 500వ షోరూమ్ ప్రారంభమైంది, అయితే రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. భారత్‌కు సుస్థిర భవిష్యత్తు అందించడానికి తమ కృషి ఇలాగే కొనసాగుతూ ఉంటుందని ఆయన అన్నారు.
(ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!)
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 40 శాతం వరకు ఉంది. కంపెనీ గత నెలలో ఏకంగా 30,000 యూనిట్లకుపైగా విక్రయించి, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో నిలబడింది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరింత గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment