Electric Scooter Fire: దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ మధ్యలో కొన్ని అవాంతరాలను కూడా ఎదుర్కొంది. ఇందులో బ్యాటరీ ఫైర్ అవ్వడం, ముందు భాగంలో ఉండే పోర్క్ ఇస్స్యూ వంటివి ఉన్నాయి. కాగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండా చూసుకుంటామని కంపెనీ సీఈఓ భవిష్ అగార్వల్ తెలిపారు. అయితే మళ్ళీ కేరళలో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కేరళలోని తిరువనంతపురంలో జరిగిన సంఘటనలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైన జులై 19న నెడుమంగడ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే దిశలో విచారణ జరుగుతోంది.
ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుడు వెల్లడించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రూ. 1.49 లక్షల ఖరీదైన స్కూటర్ దాదాపు కాలిపోయింది. ఈ ప్రమాదంలో టీవీ వంటివి కాలిపోయి మొత్తం మీద సుమారు రూ. 4.49 లక్షలు నష్టం వాటిల్లినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు ఈ విషయం మీద కంపెనీలు మెయిల్ పంపినట్లు చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలో చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. సంబంధిత కంపెనీలు దీనిమీద స్పష్టమైన రిపోర్ట్ అందించాలని అప్పట్లోనే ఆదేశించింది. కానీ చాలా రోజుల తరువాత మళ్ళీ స్కూటర్ కాలిపోయిన సంఘట వెలుగులోకి రావడం మళ్ళీ ప్రశార్థకంగా మారింది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
Ola S1 pro burnt in Thiruvananthapuram Kerala, details awaited @OlaElectric pic.twitter.com/z6JC1IUuZC
— fasil (@fasilfaaaz) July 22, 2023
Comments
Please login to add a commentAdd a comment