ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని ఓలా ఎలక్ట్రిక్ దేశ వ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. ఇందులో మూడు సెంటర్లు హైదరాబాద్ నగరంలో ప్రారంభం కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సంస్థ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను వేగంగా ప్రారంభిస్తోంది. ఈ కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు హైదరాబాద్ మాదాపూర్ శ్రీరామకాలనీలో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్లోని ఆదర్శ్ నగర్, మెహదీపట్నంలో రేతిబౌలిలో మొత్తం మూడు కొత్తగా ప్రారంభమయ్యాయి.
ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన సందర్భంగా ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఓలా కస్టమర్లకు మరింత చెరువులో ఉండటానికి లేదా కొత్త కస్టమర్ల సందేహాలను తీర్చడానికి గత కొన్ని రోజులుగా దేశం మొత్తం మీద అనుభవ కేంద్రాలను ప్రారంభిస్తున్నాము, రానున్న రోజుల్లో మరిన్ని భారతీయ ప్రధాన నగరాల్లో ఈ కేంద్రాలను ప్రారభినానున్నట్లు తెలిపారు.
(ఇదీ చదవండి: ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్: ఈ నెల 16 వరకే..!)
నిజానికి ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఈ సెంటర్ల ద్వారా టెస్ట్ రైడ్ చేయడానికి కూడా తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారులకు మరింత సులభమైన పద్దతిలో ఫైనాన్సింగ్ ఎంపికల గురించి కూడా సమచారం అందించడంలో సహాయపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment