భవిష్ అగర్వాల్ ట్వీట్.. ఇలా చేస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే..! | Send memes and wind ola s1 pro special edition electric scooter bhavish aggarwal viral tweet | Sakshi
Sakshi News home page

Ola Electric: భవిష్ అగర్వాల్ ట్వీట్.. ఇలా చేస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే..!

Published Sat, May 27 2023 4:49 PM | Last Updated on Sat, May 27 2023 5:11 PM

Send memes and wind ola s1 pro special edition electric scooter bhavish aggarwal viral tweet - Sakshi

Ola S1 Pro Special Edition: ఆధునిక కాలాన్ని సోషల్ మీడియా ప్రపంచాన్ని ఎలేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా నిమిషాల్లో వైరల్ అయిపోతోంది. అంతే కాకుండా కొన్ని సంఘటన మీద ట్రోల్స్ అండ్ మీమ్స్ మరింత ఎక్కువవుతున్నాయి. మీమ్స్ చేసేవారికి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భవిష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా ఐసీఈ అండ్ పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయడానికి ట్రై చేయండి, అందులో ఒక బెస్ట్ మీమ్స్ చేసిన ఒకరికి ఓలా ఎస్1 ప్రో స్పెషల్ ఎడిషన్ లభిస్తుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే కొంత మంది మీమ్స్ చేయడం ప్రారంభించి పోస్ట్ కూడా చేస్తున్నారు.

ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా కావాలనుకునేవారు ఐసీఈ, పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయవచ్చు. ఇది మీమ్స్ చేసేవారికి మంచి సువర్ణావకాశమనే చెప్పాలి. ఎందుకంటే రూ. లక్ష కంటే ఎక్కువ ఖరీదైన స్కూటర్ ఒక్క మీమ్స్ చేయడం ద్వారా ఉచితంగా పొందవచ్చు. బహుశా ఈ అవకాశం ఈ రోజు మాత్రమే అని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement