
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మంచి అమ్మకాలు పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపైన కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కావున కొనుగోలుదారుడు సాధారణ ధర కంటే తక్కువకే ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు.
నివేదికల ప్రకారం, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ రూ. 5,000 తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొనాలనుకునే కస్టమర్ రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు 2021లో రూ. 10,000 వరకు పెరిగాయి. ఆ సమయంలో కంపెనీ అమ్మకాల పరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత కాలంలో దేశీయ మార్కెట్లో ప్రత్యులకు గట్టి పోటీ ఇవ్వడానికి తమ స్కూటర్ల మీద మంచి ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు రూ. 5వేలు డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.
(ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్)
ఓలా ఎలక్ట్రిక్ 2023 మార్చి అమ్మకాల్లో 27,000 యూనిట్లను విక్రయించి మంచి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment