సంప్రదాయ దుస్తులపై మక్కువ | Preferred over the traditional dress | Sakshi
Sakshi News home page

సంప్రదాయ దుస్తులపై మక్కువ

Published Sat, Jul 16 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

సంప్రదాయ దుస్తులపై మక్కువ

సంప్రదాయ దుస్తులపై మక్కువ


కంటోన్మెంట్: సంప్రదాయ, శ్వేత వర్ణ దుస్తులనే తాను ఎక్కువగా ఇష్టపడతానని ప్రముఖ దర్శకుడు, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ అన్నారు. తిరుమలగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రామరాజ్ కాటన్’ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్ కాటన్ కంపెనీ ఉత్పత్తులు నాణ్యత, మన్నికైనవి కావడంతోతాను బ్రాండ్ అంబాసిడర్‌గా మారానన్నారు. ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మనవడు శ్రవంత్ రాజు, మనవరాలు దివ్య రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోరూం విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు.


రామరాజ్ కాటన్ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ కె.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశలలో తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తమ కంపెనీ 2015 ‘ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ అట్రాక్టివ్ బ్రాండ్’ జాబితాలో స్థానం దక్కించుకుందన్నారు.  కళాతపస్వి కె.విశ్వనాథ్ వచ్చారని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో షోరూముకు చేరుకొని... ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement