న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ, త్రైమాసికాలవారీ, పూర్తి సంవత్సరంవారీగా రికార్డు అమ్మకాలు నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో అత్యధికంగా 5,412 వాహనాలను విక్రయించింది. గత మార్చి త్రైమాసికంలో నమోదైన 4,697 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఇక ఆర్థిక సంవత్సరం వారీగా అమ్మకాలు 10 శాతం పెరిగి 16,497 యూనిట్ల నుంచి 18,123 యూనిట్లకు చేరాయి.
నెలవారీ అమ్మకాలకు సంబంధించి మార్చిలో అత్యధిక స్థాయిలో విక్రయించినట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్‌లో తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇవి అత్యుత్తమ గణాంకాలని వివరించారు. 2024లో 9 కొత్త వాహనాలను ఆవిష్కరిస్తున్నట్లు, వీటిలో 3 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment