January-March quarter
-
హైదరాబాద్‌లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
తక్కువ సరఫరా, లగ్జరీ అపార్ట్మెంట్లకు అధిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఎనిమిది ప్రధాన నగరాల్లో అఫోర్డబుల్ ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 61,121 యూనిట్లకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. మొదటి ఎనిమిది స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ జనవరి-మార్చి కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల అమ్మకాలు 6,3787 యూనిట్లుగా ఉన్నాయి. చౌక గృహాల సరఫరా తక్కువగా ఉండటం అమ్మకాలు స్వల్పంగా పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం, ఈ టాప్ 8 నగరాల్లో 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల తాజా సరఫరా 53,818 యూనిట్ల నుంచి 33,420 యూనిట్లకు తగ్గింది.ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ .60 లక్షల వరకు ధర కలిగిన గృహాల అమ్మకాలు 23,401 యూనిట్ల నుంచి 28,826 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 14,532 యూనిట్ల నుంచి 12,299 యూనిట్లకు పడిపోయాయి. అహ్మదాబాద్‌లో 8,087 యూనిట్ల నుంచి 6,892 యూనిట్లకు తగ్గాయి.హైదరాబాద్‌లో ఈ ఇళ్ల అమ్మకాలు 3,674 యూనిట్ల నుంచి 3,360 యూనిట్లకు తగ్గగా, చెన్నైలో అమ్మకాలు 3,295 యూనిట్ల నుంచి 2,003 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో అమ్మకాలు 5,193 యూనిట్ల నుంచి 2,801 యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో మాత్రం అమ్మకాలు 2,831 యూనిట్ల నుంచి 3,741 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో 2,774 యూనిట్ల నుంచి 1,199 యూనిట్లకు తగ్గాయి. -
మెర్సిడెస్ బెంజ్ రికార్డు విక్రయాలు..
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ, త్రైమాసికాలవారీ, పూర్తి సంవత్సరంవారీగా రికార్డు అమ్మకాలు నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో అత్యధికంగా 5,412 వాహనాలను విక్రయించింది. గత మార్చి త్రైమాసికంలో నమోదైన 4,697 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఇక ఆర్థిక సంవత్సరం వారీగా అమ్మకాలు 10 శాతం పెరిగి 16,497 యూనిట్ల నుంచి 18,123 యూనిట్లకు చేరాయి. నెలవారీ అమ్మకాలకు సంబంధించి మార్చిలో అత్యధిక స్థాయిలో విక్రయించినట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్‌లో తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇవి అత్యుత్తమ గణాంకాలని వివరించారు. 2024లో 9 కొత్త వాహనాలను ఆవిష్కరిస్తున్నట్లు, వీటిలో 3 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు చెప్పారు. -
ManpowerGroup Employment Outlook Survey: నియామకాలపై భారత్‌లో బుల్లిష్ ధోరణి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే మూడు నెలల (2024 జనవరి–మార్చి) కాలానికి నియామకాల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌వపర్ గ్రూప్ ఇండియా సర్వే వెల్లడించింది. నియామకాల ఆశావాదం భారత్‌లోనే ఎక్కువగా నమోదైంది. రానున్న మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని 37 శాతం కంపెనీలు చెప్పాయి. మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయింట్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రపంచవ్యాప్తంగా 3,100 కంపెనీలను ప్రశ్నించి ఈ వివరాలను విడుదల చేసింది. 2023 ప్రథమ త్రైమాసికంతో పోలిస్తే భారత్‌లో నియామకాల ధోరణి 5 శాతం ఎక్కువగా కనిపించింది. ‘‘దేశీయ డిమాండ్ ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. నిరంతరాయ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం భారత్‌ను లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సాయపడుతున్నాయి’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. భారత్‌లోనే అధికం.. జనవరి–మార్చి త్రైమాసికానికి నియామకాల పరంగా ఎక్కువ ఆశావాదం భారత్, నెదర్లాండ్స్‌లోనే కనిపించింది. ఈ రెండు దేశాల్లోనూ 37 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలత కనబరిచాయి. ఆ తర్వాత కోస్టారికా, అమెరికాలో ఇది 35 శాతంగా ఉంది. 34 శాతంతో మెక్సికో నియామకాల ఆశావాదంలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా సగటున చూస్తే ఇది రానున్న త్రైమాసికానికి 26 శాతంగా ఉంది. ఈ రంగాల్లో సానుకూలం రియల్ ఎస్టేట్ రంగంలో నియామకాల సానుకూల త ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత ఐటీ, కన్జ్యూ మర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో నియామకాల ధోరణి వ్యక్తమైంది. మార్చి త్రైమాసికంలో నియామకాలు పెంచుకుంటామని ఫైనాన్షియల్స్, రియల్ ఎస్టేట్ రంగంలో 45 శాతం కంపెనీలు చెప్పాయి. ఐటీ రంగంలో 44 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగంలో 42% కంపెనీలు ఇదే విధమైన దృక్పథంతో ఉన్నాయి. అతి తక్కువగా 28% మేర నియామకాల సానుకూలత ఇంధనం, యుటిలిటీ రంగాల్లో కనిపించింది. మన దేశంలో పశ్చిమ భారత్‌లో ఎక్కువగా 39 శాతం మేర నియామకాల పట్ల కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాదిలో 38 శాతం సానకూలత కనిపించింది. నిపుణుల కొరత భారత్, జపాన్‌లో నిపుణులైన మానవ వనరుల కొరత అధికంగా ఉంది. భారత్‌లో 81 శాతం సంస్థలు నైపుణ్య మానవ వనరులను గుర్తించడం కష్టంగా ఉందని చెప్పాయి. 2023 సంవత్సరం ఇదే కాలంలోని ఫలితాలతో పోలి్చచూసినప్పుడు ఒక శాతం పెరిగింది. తమకు కావాల్సిన నిపుణులను గుర్తించడం కష్టంగా ఉందని 85 శాతం జపాన్ కంపెనీలు చెప్పాయి. ఆ తర్వాత గ్రీస్, ఇజ్రాయెల్‌లోనూ 82 శాతం కంపెనీలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. నిపుణులను గుర్తించి, వారిని నియమించుకుని, అట్టి పెట్టుకునేందుకు కంపెనీలు సౌకర్యవంతమైన పని విధానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఐటీ, డేటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్, హెచ్ఆర్ నిపుణులకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. -
హైదరాబాద్ మార్కెట్లో జోరుగా ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం అధికంగా 10,200 యూనిట్లు విక్రయమయ్యాయి. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 6,560గా ఉన్నాయి. ఈ వివరాలను ప్రాపర్టీ పోర్టల్ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 22 శాతం పెరిగినట్టు, అదే కాలంలో ఇళ్ల సరఫరాలో 86 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. ఎనిమిది పట్టణాల్లోకి ఇళ్ల అమ్మకాల పరంగా ఎక్కువ వృద్ధి హైదరాబాద్ రి యల్టీ మార్కెట్లోనే నమోదు కావడం గమనార్హం. ఎనిమిది పట్టణాల్లో కలిపి జనవరి–మార్చి కాలంలో 85,850 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పట్టణాల్లో అమ్మకాలు 70,630 యూనిట్లుగా ఉన్నాయి. కొత్తగా ఇళ్ల సరఫరా 1,47,780 యూనిట్లుగా ఉంది. గృహ రుణాలపై గతేడాది నుంచి వడ్డీ రేట్లు 2.5 శాతం వరకు పెరిగినప్పటికీ, అమ్మకాలు బలంగానే ఉన్నట్టు పలు ఇతర నివేదికలు సైతం వెల్లడించాయి. ‘‘విక్రయాలు, కొత్త ఇళ్ల సరఫరా పరంగా భారత హౌసింగ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని చూస్తోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, మరోవైపు దేశీయంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితిని సానుకూలమనే చెప్పుకోవాలి’’అని ప్రాప్‌టైగర్ డాట్ కామ్ గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల్లోనూ చెప్పుకోతగ్గ వృద్ధి కనిపిస్తుండడం, మార్కెట్లో డిమాండ్ పట్ల డెవలపర్లలో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని ప్రాప్ టైగర్ నివేదిక పేర్కొంది. పట్టణాల వారీగా.. ► ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 39 శాతం పెరిగాయి. 32,380 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 23,370 యూనిట్లుగా ఉన్నాయి. ► పుణె మార్కెట్లో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెంది 18,920 యూనిట్లుగా ఉన్నాయి. ► అహ్మదాబాద్‌లో 31% అధికంగా 7,250 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ► చెన్నై మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 3,630 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 3,800 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► బెంగళూరులోనూ 3% అమ్మకాలు తగ్గాయి. 7,440 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► కోల్‌కతా మార్కెట్లో 22 శాతం తక్కువగా 2,230 యూనిట్లు విక్రయమయ్యాయి. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చిలో ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 76.3 లక్షల చదరపు అడుగులు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 34 శాతం తగ్గుదల అని రియల్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ‘2023 జనవరి–మార్చిలో నికర లీజింగ్ ఆరు త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, కొనసాగుతున్న హైబ్రిడ్ పని విధానం కారణంగా కార్పొరేట్ కంపెనీలు విస్తరణపై ఆచితూచి వ్యవహరించడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ ఖర్చులకు తగ్గించుకోవడానికి కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. నికర లీజింగ్ చెన్నై 50 శాతం పడిపోయి 6 లక్షల చదరపు అడుగులు, హైదరాబాద్ 85 శాతం తగ్గి 5.2 లక్షలు, ముంబై 39% క్షీణించి 8.8 లక్షలు, పుణే 44% తగ్గి 12.8 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ 47% దూసుకెళ్లి 19.6 లక్షల చదరపు అడుగులు, బెంగళూరు 14% పెరిగి 19.1 లక్షలు, కోల్‌కతా రెండింతలై 4.6 లక్షల చదరపు అడుగుల నికర లీజింగ్ నమోదైంది. ఈ నగరాల్లో నికర లీజింగ్ 2022 జనవరి–మార్చిలో 1.15 కోట్ల చదరపు అడుగులు ఉంది. సాంకేతిక పరిశ్రమలో మందగమనం ఉన్నప్పటికీ ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ స్థిరంగా ఉంటుంది. 2022 మాదిరిగా ఈ ఏడాది 3.6–4 కోట్ల చదరపు అడుగులు అంచనా వేస్తున్నాం. మరో త్రైమాసికం తర్వాత ఆఫీస్ డిమాండ్ ఎలా ఉంటుందనే అంశంలో స్పష్టత వస్తుంది’ అని జేఎల్ఎల్ వివరించింది. -
వ్యవసాయేతర రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: వ్యవసాయం కాకుండా, 9 రంగాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్తగా 10 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో ఈ రంగాల్లో మొత్తం ఉపాధి అవకాశాలు 3.18 కోట్లకు పెరిగినట్టు కేంద్ర కార్మిక శాఖ త్రైమాసికం వారీ ఉపాధి సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం విడుదల చేశారు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం/రెస్టారెంట్, ఐటీ/బీపీవో, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఈ ఉద్యోగాలు వచ్చినట్టు తెలిపింది. ఇదీ చదవండి : Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో! 2021 జనవరి 1 నాటికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 3.08 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 3.18 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. కరోనా ఆంక్షల తొలగింపుతో ఆర్థికరంగ కార్యకలాపాలు ఊపందుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంఘటిత రంగంలో ఉపాధికి సంబంధించి కీలక సమాచారం కోసం త్రైమాసికం వారీగా ఉపాధి సర్వేను కేంద్ర కార్మిక శాఖ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 12,000 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ 9 రంగాల్లో కలిపి ఉపాధి అవాకాశాలు 2013–14 నాటి సర్వే నాటికి 2.37 కోట్లుగా ఉండడం గమనార్హం. తయారీలో ఎక్కువ.. ఈ గణాంకాల్లో అత్యధికంగా తయారీ రంగంలో 38.5 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత విద్యా రంగంలో 21.7 శాతం, ఐటీ/బీపీవో రంగంలో 12 శాతం, ఆరోగ్య రంగంలో 10.6 శాతం మందికి ఉపాధి కల్పన జరిగింది. ఈ నాలుగు రంగాల్లోనే 83 శాతం మంది పనిచేస్తుండడం గమనార్హం. -
టెక్ మహీంద్రాకు రూపీ దెబ్బ
* 23 శాతం క్షీణించిన నికర లాభం * ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు 23% తగ్గింది. కరెన్సీ హెచ్చుతగ్గులు, వేతనాల పెంపు, ఇటీవల కొనుగోలు చేసిన కంపెనీల పనితీరు పేలవంగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మిలింద్ కుల్కర్ణి చెప్పారు. 2013-14 క్యూ4లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 క్యూ4లో రూ.472 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.5,058 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.6,117 కోట్లకు పెరిగిం దని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల పరంగా అత్యధిక వృద్ధి సాధించిన క్వార్టర్లలో ఇదొకటని వివరించారు. డాలర్ల పరంగా ఆదాయం 19% వృద్ధితో 98 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.2,628 కోట్లకు తగ్గిందని, ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.22,628 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా నికర లాభం 43 కోట్ల డాలర్లుగా, ఆదాయం 19 శాతం వృద్ధితో 368 కోట్ల డాలర్లకు చేరిందని వివరించారు. కొత్తగా చేరిన 13,840 మంది ఉద్యోగులతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,03,281కు పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.700 కోట్ల రుణభారం, రూ.3,212 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ధర మంగళవారం ఎన్ఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.640 వద్ద ముగిసింది. -
12 సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఎల్ఐసీ వాటా
రూ.16,400 కోట్లు షేర్ల కొనుగోలు - జనవరి-మార్చి క్వార్టర్‌కు న్యూఢిల్లీ: ఎల్ఐసీ జనవరి-మార్చి క్వార్టర్లో 12 సెన్సెక్స్ షేర్లలో తన వాటాను పెంచుకుంది. ఈ వాటా పెంపు కోసం రూ.16,400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. మరోవైపు ఇదే క్వార్టర్లో మరో 12 సెన్సెక్స్ షేర్లలో వాటాను తగ్గించుకుంది. రూ.6,730 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. గత కొన్ని క్వార్టర్లుగా యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీల్లో ఎల్ఐసీకి ఎలాంటి వాటా లేదు. ఇక టాటా స్టీల్, భెల్, వేదాంత, టాటా మోటార్స్ కంపెనీల్లో ఎల్ఐసీ వాటాల్లో ఎలాంటి మార్పు లేదు. కోల్ ఇండియాలో అత్యధికంగా తన వాటాను పెంచుకుంది. కోల్ ఇండియా ఆఫర ఫర్ సేల్‌లో రూ.10,754 కోట్ల విలువైన షేర్లను (4.51 శాతం వాటాను) కొనుగోలు చేసింది. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో దాదాపు సగం ఎల్ఐసీనే కొనుగోలు చేసింది. సెన్సెక్స్ కంపెనీల్లో ఎల్ఐసీకి అత్యధిక వాటా ఉన్న కంపెనీగా ఎల్ అండ్ టీ నిలిచింది. ఎల్ అండ్ టీలో సెన్సెక్స్‌కు 16.7 శాతం వాటా ఉంది -
ఎన్టీపీసీ లాభం రూ. 3,094 కోట్లు
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 3,0934 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 4,382 కోట్లు ఆర్జించింది. ఇంధన వ్యయాలు పెరగడం లాభాలను దెబ్బకొట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఇంధన వ్యయాలు రూ. 10,390 కోట్ల నుంచి రూ. 14,434 కోట్లకు ఎగశాయి. ఇదే కాలానికి ఆదాయం మాత్రం రూ. 72,098 కోట్ల నుంచి రూ. 78,922 కోట్లకు పుంజుకుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) విస్తరణపై రూ. 22,400 కోట్లమేర పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. గడిచిన ఏడాది(2013-14) రూ. 21,705 కోట్లను వెచ్చించింది. గతేడాది 233 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది 240 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టింది. 14,000 మెగావాట్లు అదనం ప్రస్తుతం 43,000 మెగావాట్ల సామర్థ్యంగల కంపెనీ 2017కల్లా అదనంగా 14,038 మెగావాట్ల విద్యుత్‌ను జత కలుపుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ సీఎండీ అరుప్ రాయ్ చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 6,000 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుకున్నట్లు తెలిపారు. వాటాదారులకు షేరుకి రూ. 1.75 డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర 3% ఎగసి రూ. 129 వద్ద ముగిసింది.