వ్యవసాయేతర రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి | One million formal jobs added in one year | Sakshi
Sakshi News home page

వ్యవసాయేతర రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి

Published Wed, Sep 28 2022 6:18 AM | Last Updated on Wed, Sep 28 2022 12:59 PM

One million formal jobs added in one year - Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయం కాకుండా, 9 రంగాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్తగా 10 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో ఈ రంగాల్లో మొత్తం ఉపాధి అవకాశాలు 3.18 కోట్లకు పెరిగినట్టు కేంద్ర కార్మిక శాఖ త్రైమాసికం వారీ ఉపాధి సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంత్రి భూపేందర్‌ యాదవ్‌ మంగళవారం విడుదల చేశారు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం/రెస్టారెంట్, ఐటీ/బీపీవో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ఈ ఉద్యోగాలు వచ్చినట్టు తెలిపింది.

ఇదీ చదవండి : Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్‌...తక్కువ ధరలో!

2021 జనవరి 1 నాటికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 3.08 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 3.18 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. కరోనా ఆంక్షల తొలగింపుతో ఆర్థికరంగ కార్యకలాపాలు ఊపందుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంఘటిత రంగంలో ఉపాధికి సంబంధించి కీలక సమాచారం కోసం త్రైమాసికం వారీగా ఉపాధి సర్వేను కేంద్ర కార్మిక శాఖ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 12,000 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ 9 రంగాల్లో కలిపి ఉపాధి అవాకాశాలు 2013–14 నాటి సర్వే నాటికి 2.37 కోట్లుగా ఉండడం గమనార్హం.

తయారీలో ఎక్కువ..  
ఈ గణాంకాల్లో అత్యధికంగా తయారీ రంగంలో 38.5 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత విద్యా రంగంలో 21.7 శాతం, ఐటీ/బీపీవో రంగంలో 12 శాతం, ఆరోగ్య రంగంలో 10.6 శాతం మందికి ఉపాధి కల్పన జరిగింది. ఈ నాలుగు రంగాల్లోనే 83 శాతం మంది పనిచేస్తుండడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement