Union Labor Department
-
అక్టోబర్లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
వ్యవసాయేతర రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: వ్యవసాయం కాకుండా, 9 రంగాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్తగా 10 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో ఈ రంగాల్లో మొత్తం ఉపాధి అవకాశాలు 3.18 కోట్లకు పెరిగినట్టు కేంద్ర కార్మిక శాఖ త్రైమాసికం వారీ ఉపాధి సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం విడుదల చేశారు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం/రెస్టారెంట్, ఐటీ/బీపీవో, ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈ ఉద్యోగాలు వచ్చినట్టు తెలిపింది. ఇదీ చదవండి : Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో! 2021 జనవరి 1 నాటికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 3.08 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 3.18 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. కరోనా ఆంక్షల తొలగింపుతో ఆర్థికరంగ కార్యకలాపాలు ఊపందుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంఘటిత రంగంలో ఉపాధికి సంబంధించి కీలక సమాచారం కోసం త్రైమాసికం వారీగా ఉపాధి సర్వేను కేంద్ర కార్మిక శాఖ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 12,000 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ 9 రంగాల్లో కలిపి ఉపాధి అవాకాశాలు 2013–14 నాటి సర్వే నాటికి 2.37 కోట్లుగా ఉండడం గమనార్హం. తయారీలో ఎక్కువ.. ఈ గణాంకాల్లో అత్యధికంగా తయారీ రంగంలో 38.5 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత విద్యా రంగంలో 21.7 శాతం, ఐటీ/బీపీవో రంగంలో 12 శాతం, ఆరోగ్య రంగంలో 10.6 శాతం మందికి ఉపాధి కల్పన జరిగింది. ఈ నాలుగు రంగాల్లోనే 83 శాతం మంది పనిచేస్తుండడం గమనార్హం. -
సింగరేణిలో 15 నుంచి సమ్మె సైరన్!
డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు విఫలం సాక్షి, మంచిర్యాల: సింగరేణి సంస్థలో చాలాకాలం తరువాత మళ్లీ సమ్మె సైరన్ మోగింది. వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని ఈనెల 15 నుంచి నిర్వహించ తలబెట్టిన సమ్మెపై మంగళవారం హైదరాబాద్లో కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యాంసుందర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వారసత్వ ఉద్యోగాల అమలు విషయంలో యాజమాన్యం స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని ఐదు జాతీయ సంఘాలు నిర్ణయించాయి. సమ్మెకు ఐదు జాతీయ సంఘాలు పిలుపునివ్వగా, అధికార గుర్తింపు యూనియన్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) మాత్రం దూరంగా ఉంది. మరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే సింగరేణి సంస్థ, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కార్మికులెవరూ సమ్మెలోకి వెళ్లకూడదని కోరుతూ సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ నాలుగు పేజీల లేఖను పత్రికా ప్రకటనగా విడుదల చేశారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ విషయంలో యాజమాన్యం స్పందన సరిగా లేదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య చెప్పారు. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయన్నారు. కార్మికుల ఆకాంక్షను నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తోందని, తమ సత్తా ఏంటో సమ్మె ద్వారా తెలియజేస్తామని చెప్పారు.